న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: ఆ ముగ్గురూ తమ కెరీర్‌లో చివరి ఐపీఎల్ ఆడుతున్నారా?

IPL 2019 : 3 Indian Cricketing Giants Might Be Playing Their Last IPL This Year | Oneindia Telugu
IPL 2019: 3 Indian stalwarts who could be playing their last season this year

హైదరాబాద్: ఇండియన్ ప్రీమయిర్ లీగ్(ఐపీఎల్) 2019 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ ట్విట‌ర్‌లో ఉంచారు.

అంత సులభం కాదు: పాక్‌ను టోర్నీ నుంచి నిషేధించడంపై గంగూలీఅంత సులభం కాదు: పాక్‌ను టోర్నీ నుంచి నిషేధించడంపై గంగూలీ

మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. నగరంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో మార్చి 29న రాజ‌స్థాన్‌ vs స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌తో ఈ సీజ‌న్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఐపీఎల్ 2019 సీజన్‌ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఈ సీజన్‌లో ప్రస్తుతం ఆడుతున్న ఓ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లకు చివరి సీజన్ కానుందనే వాదన వినిపిస్తోంది. ఈ సీజన్ తర్వాతో లేదంటే వరల్డ్ కప్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ ధోని, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ తమ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నారు.

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన కెప్టెన్‌గా ధోని భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. భారత్‌కు మూడు ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన ధోని... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే వరల్డ్‌కప్ తర్వాత ధోని రిటైర్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ వరల్డ్‌కప్‌ని నెగ్గితే.. సచిన్ టెండూల్కర్‌లానే ధోని కూడా తన కెరీర్‌కు గుడ్‌ బై చెబుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

భారత్ బ్యాట్స్‌మెన్లలో యువరాజ్ సింగ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. 2011లో టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ను నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన రికార్డు యువరాజ్ పేరిట ఉంది. గత కొన్నాళ్లుగా యువరాజ్‌ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. దీంతో ఈ ఏడాది యువరాజ్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్టులోకి తీసుకొనేందుకు ఆసక్తి చూపలేదు. వేలంలో రెండో రౌండ్‌లో బేశ్ ధరకి ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. దీంతో ఈ ఐపీఎల్ తర్వాత యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హర్భజన్ సింగ్

హర్భజన్ సింగ్

టీమిండియా వెటరన్ స్పిన్నర్‌గా పేరుగాంచిన హర్భజన్ సింగ్ భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్‌ నుంచి హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగిన హర్భజన్.. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. గత ఐపీఎల్‌లోనూ ఆశించిన మేరకు రాణించలేదు. దీంతో 2019 ఐపీఎల్ సీజన్‌తో హర్భజన్ కూడా తన క్రికెట్ కెరీర్‌కి వీడ్కోలు పలుకుతాడనే వార్తలు వస్తున్నాయి.

Story first published: Tuesday, February 26, 2019, 13:23 [IST]
Other articles published on Feb 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X