న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పేలవ ప్రదర్శన: యువీ పని అయిపోయిందా?, ట్విట్టర్‌లో జోకులు

By Nageshwara Rao
IPL 2018: Yuvraj Singh Registers Unwanted Record, Fans Divided Over Kings XI Punjab Star

హైదరాబాద్: ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతున్న యువరాజ్‌ సింగ్‌పై అభిమానులు సోషల్‌ మీడియాలో జోకులు పేల్చుతున్నారు. ఒకప్పుడు యువరాజ్ సింగ్ అనగానే గుర్తుకొచ్చేది అతని దూకుడైన బ్యాటింగ్. యువీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎంతటి బౌలర్‌కి అయినా చుక్కలు చూపించేవాడు.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఈ సీజన్‌లో యువీ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో యువరాజ్ తన ఫామ్ కోల్పోయి పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 14 పరుగులు చేసి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆడిన 7 మ్యాచుల్లో కేవలం 64 పరుగులు మాత్రమే చేసిన యువీ ఈ సీజన్‌లో అత్యల్ప స్ట్రైక్‌రేట్(91.42) కలిగిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన యువీ కేవలం 64 పరుగులు మాత్రమే చేశాడు.

యువీ ప్రదర్శనతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని జట్టు నుంచి తొలగించి ఆ స్థానంలో యువ ఆటగాళ్లకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే మహ్మద్‌ కైఫ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ల సరసన చేరి కామెంటరీ చెప్పుకో అని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

యువీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడమే ఉత్తమమని, అతని ఆటను చూడలేకపోతున్నామని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా కొందరు యువరాజ్‌పై సెటైర్లు వేస్తుండగా.. మరికొందరు మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తున్నాడు. యువరాజ్‌కి మరో అవకాశం ఇవ్వాలని, ఇస్తే అతని సత్తా నిరూపించుకుంటాడని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Saturday, May 5, 2018, 17:10 [IST]
Other articles published on May 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X