సన్‌రైజర్స్ మ్యాచ్‌ హైలెట్స్: స్టేడియంలోని ఎల్‌ఈడీ బోర్డుపై తప్పు సమాచారం

Posted By:
IPL 2018: Sunrisers Hyderabads Rashid Khan takes two spectacular catches and a wicket to restrict Rajasthan Royals

హైదరాబాద్: పదకొండో ఐపీఎల్ సీజన్‌ను హైదరాబాద్ జట్టు విజయంతో మొదలుపెట్టింది. సోమవారం ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ షోతో ఆకట్టుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌కి తోడు అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విలియమ్సన్ బుల్లెట్ లాంటి త్రోతో ఓపెనర్ డీఆర్కీని రనౌట్ చేశాడు. ఇక బౌండరీ లైన్ వద్ద రషీద్ ఖాన్ పట్టిన రెండు క్యాచ్‌లు, మిడ్ ఆఫ్‌లో విలియమ్సన్ అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి.

విలియమ్సన్ క్యాచ్

విలియమ్సన్ క్యాచ్

9వ ఓవర్‌లో విలియమ్సన్ .. స్టాన్‌లేక్ వేసిన ఈ ఓవర్‌లో ఆఖరి బంతిని బెన్ స్టోక్స్ బలంగా బాదాడు. అయితే లాంగ్ ఆన్‌లో ఉన్న విలియమ్సన్ క్యాచ్ కోసం ప్రయత్నించాడు. విలియమ్సన్ చేతిలో పడిన బంతి జారినట్లే జారి మళ్లీ అతని చేతిలోకే వచ్చి పడింది.

 రషిద్ ఖాన్ క్యాచ్

రషిద్ ఖాన్ క్యాచ్

సిద్ధార్థ్ కౌల్ వేసిన 7వ ఓవర్‌‌లో ఐదో బంతిని రహానే భారీ షాట్ ఆడబోయి డీప్ మిడ్ వికెట్ మీదుగా గాల్లోకి లేపాడు. అయితే రషీద్ ఖాన్ రాకెట్‌లా దూసుకొచ్చి డైవ్ చేసుకుంటూ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో రహానే (13) తీవ్ర నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక 14వ ఓవర్‌లో మరో అద్భుతమైన క్యాచ్‌తో దూకుడు మీదున్న సంజు సామ్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు.

ఓవర్‌లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు:

ఓవర్‌లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు:

షకీబుల్ హసన్ వేసిన ఆ ఓవర్లో ఐదో బంతిని సామ్సన్ భారీ షాట్‌కు ప్రయత్నించి గాల్లోకి లేపాడు. డీప్ కవర్‌లో ఉన్న రషీద్ ఖాన్ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో సామ్సన్ ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. అంతేకాకుండా ఈ ఓవర్‌లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు తీశాడు.

 పెర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్:

పెర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్:

సన్‌రైజర్స్ విజయంలో ఈ మూడు క్యాచ్‌లు కీలకపాత్ర పోషించాయనే చెప్పాలి. రెండు క్యాచ్‌లు అందుకున్న రషీద్ ఖాన్ ‘పెర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా అందుకున్నాడు. అయితే సామ్సన్ క్యాచ్‌కు గాను రషీద్‌కు ఈ అవార్డు దక్కింది.

పని చేయని ఎల్‌ఈడీ బోర్డు:

పని చేయని ఎల్‌ఈడీ బోర్డు:

ఉప్పల్‌ స్టేడియంలోని ఎల్‌ఈడీ స్కోరు బోర్డు సోమవారం ప్రేక్షకుల్ని అయోమయానికి గురిచేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ మధ్యలో స్కోరు బోర్డు కాస్త వెనుకబడింది. సన్‌రైజర్స్‌ విజయానికి మరో 3 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా.. మైదానంలో మాత్రం 113/1 అని స్కోరు చూపించింది. 16వ ఓవర్‌ నడుస్తుండగా.. 13వ ఓవర్‌ చూపించడంతో ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 10, 2018, 10:55 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి