న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018, RCB vs SRH: సన్‌రైజర్స్‌పై గెలిచి బెంగళూరు నిలిచేనా?

By Nageshwara Rao
IPL 2018, RCB vs SRH preview: Kohli’s challengers aim to continue revival take on table-toppers Sunrisers

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లలో సన్‌రైజర్స్ అన్నివిధాల పైచేయిగానే ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో తొమ్మిదింట్లో విజయం సాధించి, మరో మూడింట్లో ఓటమిపాలైంది.

18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడి ఐదింట విజయం సాధించి, మరో ఏడింట్లో ఓటమి పాలైంది. దీంతో 10 పాయింట్లలో పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలొ ఉంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

బెంగళూరుకు రెండు వరుస విజయాలు

బెంగళూరుకు రెండు వరుస విజయాలు

మే 12న ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచిన బెంగళూరు, 14న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. వరుస వైఫల్యాలతో అవస్థలు పడుతున్న బెంగళూరు జట్టుకు ఢిల్లీ, పంజాబ్‌లపై వరుస విజయాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.

సన్‌రైజర్స్‌పై గెలిచి విజయాన్ని నమోదు చేయాలని

సన్‌రైజర్స్‌పై గెలిచి విజయాన్ని నమోదు చేయాలని

ఇదే ఊపుతో గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచి విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ సీజన్‌లో కోహ్లీతోపాటు డివిలియర్స్ కలసి మొత్తం బెంగళూరు జట్టు సభ్యులంతా కలసి సాధించిన పరుగుల్లో దాదాపు సగం పరుగులు (కోహ్లీ 514, డివిలియర్స్ 358) సాధించారు. మిడిలార్డర్‌లో అలీ, ఆండర్సన్ లాంటి వారు పరుగులు చేయడంలో విఫలమవుతున్నారు.

17 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్

17 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్

ఇక, బౌలింగ్ విషయానికి వస్తే బెంగళూరు జట్టు ఎక్కువగా ఉమేష్ యాదవ్ పైనే ఆధారపడుతోంది. ఈ సీజన్‌లో ఉమేశ్ యాదవ్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో మొత్తం 17 వికెట్లు తీసుకున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ విజృంభిస్తే ఆ జట్టుకు తిరుగుండదు.

వరుసగా ఏడు విజయాలను నమోదు చేసిన హైదరాబాద్

వరుసగా ఏడు విజయాలను నమోదు చేసిన హైదరాబాద్

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మూడు మ్యాచ్‌లలో ఘన విజయం సాధించి, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత మరో ఏడు మ్యాచ్‌లలో వరుస విజయాలతో దూసుకుపోయింది. మే 13నన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.

జట్టు విజయాల్లో విలియమ్సన్, ధావన్ కీలకపాత్ర

జట్టు విజయాల్లో విలియమ్సన్, ధావన్ కీలకపాత్ర

గురువారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించే దిశగా కెప్టెన్ విలియమ్సన్ ప్రణాళిక రచిస్తున్నాడు. హైదరాబాద్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక, మిడిలార్డర్‌లో యూసుఫ్ పఠాన్, మనీష్ పాండే, షాకీబ్ అల్ హసన్ జట్టును అడపాదడపా ఆదుకుంటున్నారు.

ఫామ్‌లో భువనేశ్వర్

ఫామ్‌లో భువనేశ్వర్

ఇక, బౌలింగ్ విషయానికి వస్తే పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంతవరకు 8 వికెట్లు తీసుకోగా, సిద్ధార్థ కౌల్ 13, సందీప్ శర్మ 8, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 13, షాకీబ్ అల్ హసన్ 12 వికెట్లు సాధించారు.బ్యాటింగ్ కంటే బౌలింగ్‌లోనే హైదరాబాద్ బలంగా ఉండడంతో ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోర్లకే కట్టడి చేస్తున్నారు.

Story first published: Thursday, May 17, 2018, 10:50 [IST]
Other articles published on May 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X