ఐపీఎల్ 2018: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు పాండ్యా అనుమానమే!

Posted By:
IPL 2018: Mumbai Indians sweat over hardik pandyas fitness in game vs Sunrisers Hyderabad

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నగరంలోని ఉప్పల్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ తన సొంత గ్రౌండ్ వాంఖడె స్టేడియంలో ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ చేసే సమయంలో మైదానంలో కిందపడి విలవిల్లాడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు బౌలింగ్‌ పూర్తి చేసి ఫీల్డింగ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

బుధవారం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు పాండ్యా పూర్తి ఫిట్‌గానే ఉన్నాడని చెప్పనప్పటికీ, గురువారం ఉప్పల్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ పాల్గొన్న నెట్ ప్రాక్టీస్‌కు పాండ్యా హాజరు కాలేదు. దీంతో సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌కు పాండ్యా దూరం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ 11వ సీజన్‌ను ముంబై ఓటమితో మొదలుపెట్టగా.. సన్‌రైజర్స్‌ విజయంతో బోణీకొట్టింది. ఇప్పుడు ఇరుజట్లు రెండో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. సొంతగడ్డపై వరుసగా రెండో విజయంతో జోరు కొనసాగించాలని సన్‌రైజర్స్‌ ఊవిళ్లూరుతుండగా... రెండో మ్యాచ్‌లోనైనా బోణీ చేయాలని ముంబై పట్టుదలగా ఉంది.

ఈనేపథ్యంలో గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే పోరులో సన్‌రైజర్స్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. ఇలాంటి సమయంలో పాండ్య దూరమవ్వడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే. రాజస్థాన్ రాయల్స్‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ విజయం సాధించడంతో రెండో మ్యాచ్‌లో పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 12, 2018, 16:03 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి