న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: భజ్జీ ఆఖరి మ్యాచ్ అదేనా??

IPL 2018: MS Dhoni Promoted Harbhajan Singh and Deepak Chahar to Disrupt KXIP Bowlers Plans

హైదరాబాద్: ఐపీఎల్‌లో భజ్జీ ఆశించినంత ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడని అందుకే ప్లేఆఫ్‌కు అతనిని తప్పించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో చెన్నై తరపున ఆడేందుకు ఖాయమైన స్పిన్నర్ భజ్జీ. ఈ క్రమంలో సూపర్ కింగ్స్ తరపున ప్రచారంలో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. కానీ, తనదైన శైలిలో వికెట్లు తీయలేకపోయాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో హర్భజన్‌ సింగ్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపించి ఎంఎస్‌ ధోనీ అందరినీ ఆశ్చర్యంలో పడేశాడు.

వినూత్నంగా ఆలోచించిన ధోనీ బౌలర్లను:

వినూత్నంగా ఆలోచించిన ధోనీ బౌలర్లను:

ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో 154 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై వెంటవెంటనే 3 కీలక వికెట్లు చేజార్చుకొంది. పంజాబ్‌ బౌలర్లు మంచి స్వింగ్‌, సీమ్‌ రాబడుతున్నారు. ఈ క్రమంలో వినూత్నంగా ఆలోచించిన ధోనీ బౌలర్లు హర్భజన్‌, దీపక్‌ చాహర్‌ను క్రీజులోకి ముందు పంపించాడు.

అంచనాలకు తగ్గట్టుగానే భజ్జీ, చాహర్‌:

అంచనాలకు తగ్గట్టుగానే భజ్జీ, చాహర్‌:

మహీ అంచనాలకు తగ్గట్టుగానే భజ్జీ, చాహర్‌ బ్యాటింగ్‌లో రాణించారు. వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. అయితే ఈ సీజన్‌లో భజ్జీ తనను తాను నిరూపించుకోలేకపోయాడు. 12 మ్యాచుల్లో 7 వికెట్లు తీసి కేవలం 27పరుగులు చేశాడు. ఇది అతడి నుంచి ఆశించతగ్గ గణాంకాలు కావని కొందరి అభిప్రాయం.

భజ్జీని తప్పించి.. కర్ణ్‌శర్మను తీసుకుంటాడనీ:

భజ్జీని తప్పించి.. కర్ణ్‌శర్మను తీసుకుంటాడనీ:

భజ్జీని తప్పించి ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకు ధోనీ.. కర్ణ్‌శర్మను తీసుకుంటాడనీ అంటున్నారు. గౌరవప్రదంగా సాగనంపడం మహీ ప్రత్యేకత అని అందుకే చివరి లీగ్‌ మ్యాచ్‌లో భజ్జీని ముందుగా పంపించాడని పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ భజ్జీకి బ్యాటింగ్‌ చేసేందుకు తగినన్ని అవకాశాలు రాలేదు. టాప్‌ ఆర్డర్‌ లేదంటే మిడిలార్డర్‌ ఎప్పుడూ పనికానిచ్చేది.

మరింత స్వింగ్‌ రాబట్టేలా కనిపించారని

మరింత స్వింగ్‌ రాబట్టేలా కనిపించారని

పంజాబ్‌ బౌలింగ్‌ లైనప్‌ చూస్తే వారు మరింత స్వింగ్‌ రాబట్టేలా కనిపించారని అందుకే టెయిలెండర్లను ముందుగా పంపించానని మ్యాచ్‌ ముగిసిన తర్వాత ధోనీ వివరించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి.

Story first published: Tuesday, May 22, 2018, 9:56 [IST]
Other articles published on May 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X