హార్దిక్ పాండ్యా పడిపోయాడు.. పరుగు తీస్తుండగా బ్రావో తగలడంతో..

Written By:
 This photo of Hardik Pandya

హైదరాబాద్: ఘనంగా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018లో టీమిండియా ఆల్ రౌండర్, జూనియర్ కపిల్ దేవ్ అని పిలుస్తోన్న హార్ధిక్ పాండ్యా పడిపోయాడు. మ్యాచ్ చివరి బంతికి రెండు పరుగులు చేయాలనే ఉద్దేశ్యంతో పరుగు తీస్తుండగా కాలు బెణకడంతో పడిపోయాడు.

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బ్యాటింగ్‌ చేస్తున్న ఆల్‌ రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా కాలిమడమ పట్టేడయంతో మధ్యలోనే మైదానం వీడివెళ్లాల్సి వచ్చింది. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌కు సంబంధించి చివరి ఓవర్‌ డ్వేన్‌ బ్రావే వేశాడు. చివరి బంతికి రెండో పరుగు తీయబోయి పాండ్యా గాయపడ్డాడు. రెండో పరుగు కోసం ప్రయత్నించిన పాండ్యా కాలు బెణకడంతోపాటు బ్రావే ఢీకొనడంతో మైదానంలో కిందపడ్డాడు.

ఈ సందర్భంగా కిందపడి బాధతో మూలుగుతున్న పాండ్యా చుట్టూ ఆటగాళ్లు చేరి ఆరా తీశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఫొటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 'భాయ్‌.. ఆమె వెళ్లిపోయింది. నీ వైపు చూడనే చూడలేదు. ఇక, చాలు లే' అంటూ జోకుల మీద జోకులు పేలుస్తున్నారు. 'సరే.. నువ్వే కపిల్‌ దేవ్‌వి.. ఏడ్వటం ఆపి.. ఇకనైనా లే'అంటూ సెటైర్లు వేస్తున్నారు.

రెండేళ్ల నిషేధం తర్వాత మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు పునరాగమనం చేయడంతో అభిమానుల్లో ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అత్యద్భుతంగా ఆడిన డ్వేన్‌ బ్రేవో, కేదార్‌ జాధవ్‌ చెన్నై జట్టుకు ముంబై ఇండియన్స్‌పై థ్రిల్లింగ్‌ విక్టరీని అందించారు. ఈ మ్యాచ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్రేవో, కేదార్‌ జాధవ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 8, 2018, 17:36 [IST]
Other articles published on Apr 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి