SRHvsRCB: హైదరాబాద్‌ను చిత్తు చేసిన బెంగళూరు, 14 పరుగుల తేడాతో నిలుపుకున్న ప్లేఆఫ్ ఆశలు

ipl 2018 match 51 srh vs rcb match report from bangalore stadium

హైదరాబాద్:ప్లేఆఫ్ ఆశలు నిలుపుకోవడానికి చేసిన పోరాటంలో హైదరాబాద్ జట్టును ముప్పుతిప్పులు పెట్టింది బెంగళూరు, చిన్నస్వామి స్టేడియం వేదికగా రెచ్చిపోయిన బెంగళూరు ఆటగాళ్లు మంచి విజయాన్ని పొందగలిగారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ కడవరకూ పోరాడి ఓడింది. లక్ష్యం భారీగా ఉండటంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

విలియమ్సన్‌(81), మనీష్‌ పాండే(62)లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌, అలెక్స్‌ హేల్స్‌లు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించిన తర్వాత ధావన్‌(18) ఔటయ్యాడు. ఆపై 17 పరుగుల వ్యవధిలో హేల్స్‌(37) సైతం పెవిలియన్‌ చేరడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 64 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో కేన్‌ విలియమ్‌సన్, మనీశ్ పాండేలు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకున్నారు.

ఒకవైపు విలియమ్సన్‌ తన సహజ శైలికి భిన్నంగా విరుచుకుపడి ఆడితే, మనీశ్ పాండే సమయోచితంగా బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరి ఓవర్‌ మొదటి బంతికి విలియమ‍్సన్‌ ఔట్‌ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్‌ విజయానికి 20 పరుగులు కావాల్సి ఉండగా, 5 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 91/2

భారీ టార్గెట్‌ను చేధించే దిశగా బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్లు ధాటిగా ఆరంభించినా 5.1 ఓవర్‌కు ధావన్ తొలి వికెట్‌ను కోల్పోగా.. రెండో వికెట్ అలెక్స్ హేల్స్ (37)ను 7.6 ఓవర్‌కి కోల్పోయింది. ఓపెనర్ల స్థానంలో జట్టును నడిపించే దిశగా క్రీజులో అడుగుపెట్టిన కెప్టెన్ దూకుడుతో కూడిన ఆటను ప్రదర్శిస్తూనే సమయానికి తగ్గట్టుగా షాట్‌లు కొడుతూ జట్టును నడిపిస్తున్నాడు. అతనికి తోడుగా మరో ఎండ్‌లో కొనసాగుతోన్న మనీష్ పాండే సైతం కెప్టెన్ అనుసరిస్తూ చక్కటి ఇన్నింగ్స్‌ను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్‌సన్ (34), మనీశ్ పాండే (2) క్రీజులో ఉన్నారు.


బెంగళూరు ఇన్నింగ్స్:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీర బాదుడుతో హైదరాబాద్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది. పది ఓవర్ల అనంతరం క్రీజులో ఉన్న మొయిన్ అలీ, డివిలియర్స్ రెచ్చిపోయి ఆడారు. కేవలం 39బంతుల్లోనే 69 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చక్కటి భాగస్వామ్యంతో కొనసాగిన వారి జోడి ఒక్క బంతి తేడాతో మొయిన్ అలీ 34 బంతుల్లో 65పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గ్రాండ్ హోమ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ఆడాడు. బౌండరీలనే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయాడు. 17 బంతుల్లోనే 40పరుగులు చేసి ఒకానొక దశలో జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. మొయిన్ అలీ వికెట్ అనంతరం మరో ఎండ్ లో క్రీజులోకి వచ్చిన మన్‌దీప్ సింగ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి టిమ్ సౌథీ, సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నారు. సర్ఫరాజ్ ఖాన్ జట్టు మొత్తంలో అందరికంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. కేవలం ఆడిన 8బంతుల్లోనే 22పరుగులు చేశాడు.

ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన ఫీల్డింగ్, బౌలింగ్ ప్రదర్శించే హైదరాబాద్‌కు ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీసేనకు అడ్డుకట్ట వేసేందుకు జట్టులో బౌండరీల దగ్గరే ఫీల్డింగ్ సెట్ చేశారు. అక్కడికి కేన్ విలియమ్‌సన్ ఫీల్డింగ్ విషయంలో కాస్త నిరుత్సాహానికి గురైయ్యాడు. ఈ క్రమంలో సందీప్ శర్మ 1/40, షకీబ్ అల్ హసన్ 0/35, రషీద్ ఖాన్ 3/27, సిద్ధార్థ్ కౌల్ 2/44, బాసిల్ తంపి 0/70 వికెట్లు తీయగలిగారు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 84/2

బెంగళూరు ఆరంభం నుంచి దూకుడుగా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తొలి ఐదు ఓవర్లకే రెండు వికెట్లు చేజార్చుకున్నా పరుగుల విషయంలో మాత్రం సంకోచించేదే లేదన్నట్లు ఆడుతోంది. ఓపెనర్లుగా దిగిన కోహ్లీ, పార్థివ్ పటేల్ ఇద్దరూ అవుటై ఇన్నింగ్స్‌ను ముగించి పెవిలియన్ చేరుకున్నారు. నాలుగు బంతులు ఆడి
తొలి వికెట్‌గా పార్థివ్ పటేల్‌ కేవలం 1పరుగు తీసి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ వచ్చీ రావడంతోనే ఫోర్ బౌండరీతో మొదలుపెట్టాడు. అతనికి భాగస్వామ్యాన్ని అందించే క్రమంలో కోహ్లీ(12)భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. అతని తర్వాత బరిలోకి దిగిన మొయిన్ అలీ (30) డివిలియర్స్ (41)కు చక్కని భాగస్వామ్యాన్ని అందిస్తున్నాడు.


టాస్ రిపోర్టు:

ఐపీఎల్‌లో భాగంగా జరుగుతోన్న 51వ మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరు తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

రెండు విజయాలు సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకున్న కోహ్లి సేన గురువారం రాత్రి సన్‌రైజర్స్‌తో పోరుకు సిద్ధపడుతోంది. 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ మరో విజయం కోసం బరిలో దిగనుండగా.. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ప్లేఆఫ్‌ అవకాశాలను మెరుగు పర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఓ దశలో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్లు కనిపించింది. కానీ ఢిల్లీ, పంజాబ్‌లపై గెలవడం ద్వారా తిరిగి పోటీలోకి వచ్చింది. , రాజస్థాన్‌లతో జరిగే చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలవడం ద్వారా టాప్-4లో నిలవాలని కోహ్లి సేన భావిస్తోంది.

మరోవైపు హైదరాబాద్ జట్టు చివరి రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు, కోల్‌కతాలపై గెలవడం ద్వారా అత్యధిక లీగ్ విజయాలతో ప్లేఆఫ్ చేరాలని భావిస్తోంది. 2008లో రాజస్థాన్, 2014తో పంజాబ్ 11 విజయాలతో లీగ్ దశను ముగించాయి. చివరి రెండు మ్యాచ్‌లను గెలవడం ద్వారా ఆ రికార్డును సమం చేయాలని సన్‌రైజర్స్ పట్టుదలతో ఉంది.


ఆడనున్న ఇరు జట్లు:

బెంగళూరు జట్టు:
Virat Kohli (c), Parthiv Patel (wk), Moeen Ali, AB de Villiers, Mandeep Singh, Sarfaraz Khan, Colin de Grandhomme, Tim Southee, Umesh Yadav, Mohammed Siraj, Yuzvendra Chahal

హైదరాబాద్ జట్టు:
Shikhar Dhawan, Alex Hales, Kane Williamson (c), Manish Pandey, Deepak Hooda, Shakib Al Hasan, Shreevats Goswami (wk), Rashid Khan, Basil Thampi, Siddarth Kaul, Sandeep Sharma

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Thursday, May 17, 2018, 19:06 [IST]
  Other articles published on May 17, 2018
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more