న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతా చేతిలో ఓటమి చెన్నైకి చెంపదెబ్బ లాంటిది: ప్లెమింగ్

By Nageshwara Rao
IPL 2018: Loss vs KKR a slap in the face for Chennai Super Kings, says Stephen Fleming

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెంపదెబ్బ లాంటిదని చెన్నై సూపర్‌ కింగ్స్‌ హెడ్ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా చెన్నై-కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు మొత్తం ఘోరంగా విఫలమైందని చెప్పడానికి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌‌ను పరిశీలిస్తే సరిపోతుందని ఫ్లెమింగ్‌ చెప్పుకొచ్చాడు. ఫీల్డింగ్‌లో లోటుపాట్లు ఉన్నాయని తమకు ముందే తెలుసునని, అవి ఈ మ్యాచ్‌లో బయటపడ్డాయని పేర్కొన్నాడు.

1
43443
6 వికెట్ల తేడాతో చెన్నై ఓటమి

6 వికెట్ల తేడాతో చెన్నై ఓటమి

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. చెన్నై నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 17 .4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది.

కోల్‌కతా విజయంలో శుభ్‌మాన్ గిల్ కీలకపాత్ర

కోల్‌కతా విజయంలో శుభ్‌మాన్ గిల్ కీలకపాత్ర

కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మాన్‌ గిల్‌(57 నాటౌట్; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు‌), దినేశ్‌ కార్తీక్‌(45 నాటౌట్; 7ఫోర్లు,1 సిక్స్‌‌)లు రాణించగా, సునీల్‌ నరైన్‌(32; 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో సునీల్‌ నరైన్‌ వరుసగా ఇచ్చిన రెండు క్యాచ్‌లను జడేజా వదలి పెట్టిన సంగతి తెలిసిందే.

రెండు వరుస క్యాచ్‌లను మిస్ చేసిన జడేజా

రెండు వరుస క్యాచ్‌లను మిస్ చేసిన జడేజా

దీనిపై ప్లెమింగ్ మాట్లాడుతూ 'ఆసిఫ్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను జడేజా వదిలిపెట్టాడు. చెన్నై ఫీల్డింగ్ పేలవంగా ఉందని చెప్పేందుకు ఇది ఒక మచ్చుతునక. ఆఖరు ఓవర్లలో చెన్నై పరుగుల వేగం కొంచెం మందగించింది. డెత్‌ ఓవర్లలో జడేజా ఒక బంతికి ఒకటి కంటే ఎక్కువ పరుగులు సాధించడంపై దృష్టి పెట్టాలి' అని అన్నాడు.

స్లాగ్‌ ఓవర్లలో కోల్‌కతా స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్‌

స్లాగ్‌ ఓవర్లలో కోల్‌కతా స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్‌

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్లెమింగ్ కొనియాడాడు. స్లాగ్‌ ఓవర్లలో కోల్‌కతా స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్‌ చేసి చెన్నై పరుగులను నియంత్రించడంలో విజయం సాధించారని తెలిపాడు. పియూష్ చావ్లా 20వ ఓవర్ వేసి 15 పరుగులివ్వగా, 18వ ఓవర్ వేసిన కుల్దీప్ 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Story first published: Friday, May 4, 2018, 16:39 [IST]
Other articles published on May 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X