న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రైనా స్ఫూర్తితో: రూ.80 లక్షలకు కొనుగోలు చేయడం ఆశ్చర్యమేసింది

By Nageshwara Rao
IPL 2018: KKR recruit Rinku Singh hopes to use Suresh Raina’s advice to play freely

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ఇచ్చిన స్ఫూర్తితో ఐపీఎల్ 2018 సీజన్‍‌లో అద్భుత ప్రదర్శన చేస్తానని అంటున్నాడు ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన క్రికెటర్‌ రింకూ సింగ్‌. త్వరలో ఆరంభమయ్యే ఐపీఎల్ 11వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున బరిలోకి దిగుతున్న రింకూ సింగ్‌.. గతంలో రైనా ఇచ్చిన సలహాను పాటిస్తానంటున్నాడు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

'ఎలాంటి ఒత్తిడి లేకుండా.. నీ సహజశైలిలో ఆడి ఐపీఎల్‌లో రాణించు' అని రైనా సందేశం పంపాడని, ఈ సీజన్‌లో అరంగేట్రం చేస్తే తప్పకుండా నా ఆరాధ్య ఆటగాడి సలహా పాటిస్తానని రింకూ సింగ్ స్పష్టం చేశాడు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రింకూ సింగ్ దేశవాళీ టోర్నీలో అరంగేంట్రం చేసిన సందర్భంగా రైనా జత గ్లౌజులు, బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

'నాకు రైనానే ఆదర్శం. నేను ఐపీఎల్లోకి ప‍్రవేశించిన సమయంలో నా రూమ్‌కి వచ్చిన రైనా కొన్ని సలహాలు ఇచ్చాడు. స్వేచ్ఛగా ఆడేందుకు యత్నించమన్నాడు. అదే సమయంలో ఒక జత గ్లోవ్స్‌, బ్యాట్‌ కూడా రైనా కానుకగా ఇచ్చాడు. నేను బ్యాటింగ్‌లో కూడా ఎప్పుడూ రైనానే అనుకరిస్తూ ఉంటా. ఐపీఎల్‌ నుంచి చాలా నేర్చుకున్నా' అని అన్నాడు.

IPL 2018: KKR recruit Rinku Singh hopes to use Suresh Raina’s advice to play freely

'ఈ ఏడాది నన్ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) రూ. 80 లక్షలు కొనుగోలు చేయడం ఆశ్చర్యమేసింది. నాకు రూ. 30 లక్షల నుంచి 35 లక్షల వరకూ దక్కుతుందని మాత్రమే భావించి. నేను ఊహించిన దాని కంటే రెట్టింపు మొత్తానికి కేకేఆర్‌ కొనుగోలు చేయడం నిజంగా ఆశ్చర్యపరిచింది' అని రింకూ సింగ్‌ తెలిపాడు.

అలీగఢ్ నుంచి తొలిసారిగా తాను మాత్రమే ఐపీఎల్‌కు ఎంపికయ్యానని చెప్పిన రింకూ సింగ్ తన స్ఫూర్తితో అలీగఢ్‌లో క్రికెట్ ఆడే కుర్రాళ్లంతా చాలా అంకితభావంతో ప్రాక్టీస్ చేస్తున్నారని కొనియాడాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు నిర్వహించిన క్యాంప్‌లో 31 బంతుల్లో 91 పరుగులు చేయడంతోనే వెలుగులోకి వచ్చానని పేర్కొన్నాడు.

రంజీట్రోఫీతోపాటు దేశవాళీ టీ20 పోటీలలో రాణించడంతో ఐపీఎల్‌లో ఆడేందుకు అవకాశం దక్కిందని తెలిపాడు. ఎలాంటి ఒత్తిడి ఎదురైనా ప్రశాంతంగా ఆడి పరుగులు సాధిస్తానని రింకూ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. గత సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రింకూని కనీస ధర రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది.

ఈ మొత్తంతో తన ఏకైక సోదరి వివాహం చేయడంతో పాటు ఇంట్లోకి కాస్త సామాగ్రిని సమకూర్చుకున్నాడు.. కానీ ఆడేందుకు అవకాశం రాలేదు.. రిజర్వ్‌ బెంచ్‌పై కూర్చోవాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం మైదానంలోకి దిగాలి.. ఆడాలనే తపనతోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Story first published: Saturday, March 24, 2018, 12:53 [IST]
Other articles published on Mar 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X