న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్లే‌ఆఫ్స్‌కు ముందు రాజస్థాన్‌కు షాక్: స్వదేశానికి స్టోక్స్, బట్లర్

By Nageshwara Rao
IPL 2018: Jos Buttler, Ben Stokes to return home after KKR clash

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న దశలో రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ తగిలింది. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషిస్తోన్న ఓపెనర్ జోస్ బట్లర్‌తో పాటు ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకునే క్రమంలో వీరిద్దరూ దూరం కావడం రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పాకిస్థాన్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ మంగళవారం జట్టును ప్రకటించింది. ఇందులో బట్లర్‌, స్టోక్స్‌ చోటు దక్కించుకున్నారు. పాకిస్థాన్‌-ఇంగ్లాండ్ మధ్య మే 24న తొలి టెస్టు లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరూ వెంటనే ఇంగ్లాండ్‌ వచ్చి జట్టు సభ్యులతో కలవాలని బోర్డు నుంచి స్టోక్స్‌, బట్లర్‌కు ఆదేశాలు అందాయి.

స్వదేశానికి పయనమైన స్టోక్స్, బట్లర్

స్వదేశానికి పయనమైన స్టోక్స్, బట్లర్

దీంతో ఐపీఎల్‌ను వదిలి వీరిద్దరూ స్వదేశానికి పయనం కానున్నారు. ఐపీఎల్‌లో జోస్ బట్లర్ ప్రదర్శనను చూసి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అతడికి టెస్టు జట్టులో చోటు కల్పించింది. దీంతో జోస్ బట్లర్ తిరిగి ఏడాదిన్నర విరామం తర్వాత ఇంగ్లాండ్ తరుపున టెస్టు క్రికెట్ ఆడబోతున్నాడు. చివరగా 2016 డిసెంబర్లో భారత్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో బట్లర్ చోటు దక్కించుకున్నాడు.

రాజస్థాన్ ఆడబోయే మిగతా మ్యాచ్‌లకు దూరం

రాజస్థాన్ ఆడబోయే మిగతా మ్యాచ్‌లకు దూరం

దీంతో వీరిద్దరూ తర్వాతి రాజస్థాన్ రాయల్స్ ఆడబోయే మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నారు. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడిన మ్యాచే ఈ సీజన్‌లో వారికి చివరి మ్యాచ్‌ అని తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 56.55 సగటుతో 509 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు.

రాజస్థాన్ విజయాల్లో బట్లర్ కీలకపాత్ర

రాజస్థాన్ విజయాల్లో బట్లర్ కీలకపాత్ర

ఈ ఏడాది రాజస్థాన్ గెలిచిన అన్ని మ్యాచ్‌ల్లో కూడా జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. కోల్‌కతాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన బట్లర్ కొద్దిలో వరుసగా ఆరో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక, ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర పలికిన స్టోక్స్‌ టోర్నీలో 13 మ్యాచ్‌లు ఆడాడు.

196 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన స్టోక్స్

196 పరుగులు మాత్రమే చేసిన బెన్ స్టోక్స్ 8 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్‌ తన ఇనిస్టాగ్రామ్ ద్వారా రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లతో, ఫ్రాంఛైజీ నిర్వాహకులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. సహచర ఆటగాళ్లతో దిగిన కొన్ని ఫొటోలను ఈ సందర్భంగా బెన్ స్టోక్స్‌ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

Story first published: Wednesday, May 16, 2018, 13:54 [IST]
Other articles published on May 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X