న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL FINAL, SRHvsCSK: ట్రోఫీని ఎగరేసుకుపోయిన చెన్నై, పునరాగమనం విజయవంతం

ipl 2018 final srh vs csk live march report from wankhede stadium mumbai

హైదరాబాద్: ఐపీఎల్‌-11 టైటిల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన తుది పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై విజయంలో షేన్‌ వాట్సన్‌ 57 బంతుల్లో(117) నాటౌట్‌‌గా 11 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ ఐపీఎల్‌లో వాట్సన్‌కు రెండో సెంచరీ కాగా, రెండు సెంచరీలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పైనే చేయడం విశేషం.

అతనికి జతగా సురేశ్‌ రైనా(32) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై సునాయాసంగా గెలుపొందింది. ఇది చెన్నైకు మూడో ఐపీఎల్‌ టైటిల్‌. మరొకవైపు ఫైనల్‌ ఫైట్‌లో బౌలింగ్‌లో పూర్తిగా విఫలమైన సన్‌రైజర్స్‌ రన్నరప్‌గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

జట్టులో ఆటగాళ్లు గాయం కారణంగా దూరమవుతోన్న పట్టుదలతో నిలిచి విజయాన్ని చేజిక్కుంచుకుంది చెన్నై. జట్టులో అందరూ ముప్పైకి పైబడ్డ వయస్సు వాళ్లంటూ తీసి పడేసిన వాళ్లందరికీ ధీటుగా జవాబిచ్చింది.

పది ఓవర్లు పూర్తయ్యేసరికి:

చెన్నై ఆటగాళ్లు రైజర్స్‌పై విజృంభించి ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన అనంతరం బరిలోకి దిగిన సురేశ్ రైనా చక్కని భాగస్వామ్యం ఇస్తుండటంతో రైనా వాట్సన్‌ల ద్వయం చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో హైదరబాద్ బౌలర్లు మాయాజాలం ఎంతమాత్రమూ ప్రభావం చూపలేకపోతోంది. పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 80/1, క్రీజులో షేన్ వాట్సన్ (45), సురేశ్ రైనా (22) ఉన్నారు.


తొలి ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి:

మ్యాచ్ ఆరంభంలోనే చెన్నై జట్టుకు ఆటంకం ఎదురైంది. పెద్దగా పరుగులు చేయకపోయిన క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయ్నతించిన డుప్లెసిస్ 3.6ఓవర్లకు 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. భారీ అంచనాలతో జట్టులో మార్పులు చేసి తుది జట్టుకు డుప్లెసిస్ ను తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అతని తర్వాత క్రీజులోకి దిగిన సురేశ్ రైనా భాగస్వామ్యంతో వాట్సన్ పరుగులు తీయాల్సి ఉంది. ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి 20/1, క్రీజులో షేన్ వాట్సన్ (7), సురేశ్ రైనా (2) ఉన్నారు.


జోరుగా సన్‌రైజర్స్ ఇన్నింగ్స్, చెన్నై టార్గెట్: 179

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ ఆరంభంలో తడబడినా నాలుగు ఓవర్లు అయ్యేవరకూ కాస్త నిదానంగా ఆడారు. క్రమేపీ పుంజుకున్న రైజర్స్ ముంబై స్టేడియంలో మంచి టార్గెట్‌నే సాధించారు. పుంజుకుంటుందన్న సమయంలో ధావన్ , విలియమ్‌సన్ వికెట్లు కోల్పోగా జట్టు సంక్షోభంలో పడింది. ఆ సమయంలో క్రీజులోకి దిగిన పఠాన్ మ్యాచ్ ముగిసే వరకూ క్రీజులో నిలబడి హైదరాబాద్ జట్టుకు మంచి పరుగులు అందించాడు.

వచ్చీ రాగానే దీపక్ హుడా మూడు పరుగులు చేసి వెనుదిరిగాడు. హుడా నిర్లక్ష్యానికి ఎంగిడి ఖాతాలో మరో వికెట్ చేరింది. చెన్నై బౌలర్లు తీవ్రంగా శ్రమించి ఒక్కో వికెట్ తీయగలిగారు. ఎంగిడి, శార్దూల్ ఠాకూర్, కర్ణ్ శర్మ, డేన్ బ్రావో, రవీంద్ర జడేజాలకు ఒక్కొక్క వికెట్ తీశారు.


పుంజుకుంటోన్న పఠాన్, షకీబ్ అవుట్:

రైజర్స్‌కు మరో ఎదురుదెబ్బ. బ్రావో చేతికి చిక్కిన షకీబ్ అల్ హసన్. మంచి భాగస్వామ్యానికి యత్నించిన సన్‌రైజర్స్ షకీబ్‌ అవుట్‌తో మళ్లీ సంక్షోభంలో పడింది. బ్రావో వేసిన బంతిని నేరుగా రైనా క్యాచ్ అందుకున్నాడు. దీంతో షకీబ్ అల్ హసన్ (23)పరుగులకే వెనుదిరిగాడు. క్రీజులో కెప్టెన్ లేమితో బెదిరిపోయిన హైదరాబాద్‌కు యూసఫ్ పఠాన్ ఆసరాగా నిలిచాడు. నత్త నడకన కొనసాగిన స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. బరిలోకి దిగి తొలి బంతి నుంచి పరుగులు రాబట్టే యోచనలో ఉన్నాడు.

16ఓవర్లు పూర్తయ్యేసరికి 134/4, క్రీజులో దీపక్ హుడా (1), యూసఫ్ పఠాన్(27) ఉన్నారు.


హైదరాబాద్ కెప్టెన్ అవుట్:

12వ ఓవర్ తొలి బంతికి హైదరాబాద్ కెప్టెన్‌ను కోల్పోయింది. ప్రగాడ నమ్మకంతో హర్భజన్‌కు బదులుగా బరిలోకి దిగిన కర్ణ శర్మ ఈ మ్యాచ్‌లో వేస్తున్న రెండో ఓవర్ మొదటి బంతికే హైదరాబాద్ ప్రధాన వికెట్‌ను తీయగలిగాడు. 12.1వ ఓవర్లకు కేన్ విలియమ్‌సన్ ఫ్రంట్ ఫూట్‌కు వెళ్లి షాట్ యత్నించాడు. తృటిలో బాల్ ఎదుర్కోలేకపోవడంతో అది కాస్త ధోనీ చేతిలో పడి స్టంప్ అవుట్ అయి వెనుదిరిగాడు. 13వ ఓవర్ పూర్తయ్యేసరికి 108/3. ప్రస్తుతం క్రీజులో యూసఫ్ పఠాన్(7), షకీబ్ అల్ హసన్(18) ఉన్నారు.


రెండో వికెట్‌ను కోల్పోయిన హైదరాబాద్:
క్రీజులో కుదురుతుందనకుంటున్న తరుణంలో హైదరాబాద్‌కు పెద్ద ఆటంకం ఎదురైంది. బ్యాటింగ్‌లో అతనిపైనే అన్ని ఆశలు నిలుపుకున్న హైదరాబాద్‌కు ధావన్ 25 బంతుల్లో కేవలం 26పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 8.3 ఓవర్లకు ధావన్ వికెట్ కోల్పోయింది. 9వ ఓవర్‌కి క్రీజులో విలియమ్‌సన్ (30), షకీబ్ అల్ హసన్(5) ఉన్నారు.


క్రమేపీ వేగం పుంజుకుంటోన్న హైదరాబాద్

దూకుడు మొదలైంది. కెప్టెన్ విలియమ్‌సన్ ఓ ఎండ్‌లో మరో ఎండ్‌లో ధావన్ దాదాపు కుదురుకున్నట్లుగానే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేగాన్ని పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. పవర్ ప్లే అనంతరం చెన్నై స్పిన్ ప్రయోగించి హైదరాబాద్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్రీజులో ధావన్ (25), విలియమ్‌సన్(28) ఉన్నారు. ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి 62/1.


ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి:

కెప్టెన్ ధోనీని అనుసరిస్తూ చెన్నై జట్టు చాలా ప్రశాంతంగా ఆడుతోంది. కానీ, రెండో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయిన హైదరాబాద్ భారీ షాట్‌లకు కాస్త తడబడుతోంది. ఈ నేపథ్యంలో కేన్ విలియమ్‌సన్ బౌండరీలకు యత్నిస్తున్నాడు. కానీ రన్ రేట్ 6తో ఈ ఐదో ఓవర్‌ను ముగించారు. క్రీజులో శిఖర్ ధావన్ (9), కేన్ విలియమ్సన్ (14) ఉన్నారు.


తొలి వికెట్ చేజార్చుకున్న హైదరాబాద్:

ఆరంభంలోనే శ్రీవత్స గోస్వామి వికెట్‌ను చేజార్చుకుంది హైదరాబాద్. భారీ అంచనాలతో బరిలోకి దిగిన హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. ఎంగిడి వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి అనవసర పరుగుకు ప్రయత్నించి గోస్వామి(5) రనౌట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 1 వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. రెండో ఓవర్ ముగిసే సరికి క్రీజ్‌లో విలియమ్‌సన్(1), ధావన్(7) ఉన్నారు.


టాస్ రిపోర్టు:

తుది సమరానికి సిద్ధమైన హైదరాబాద్, చెన్నైలు బలమైన ప్రణాళికలతో బరిలోకి దిగి పోరాడుతున్నాయి. నున్నాయి. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికగా టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకుంది.

లీగ్ దశ ముగిసే సరికి టాప్ 1 స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్ 1మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ అదే పోరాట పటిమను ప్రదర్శిస్తూ కోల్‌కతాపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ అసాధారణ ప్రతిభ చూపించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఐపీఎల్ తుది సమరంలో హైదరాబాద్‌ వర్సెస్ చెన్నై పైచేయి సాధించేందుకు భారీ పోరాటం జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం వాంఖడే స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో సన్‌రైజర్స్‌పై రెండుసార్లు గెలిచిన ధోనీ సేన.. తొలి క్వాలిఫయర్‌లోనూ హైదరాబాద్‌పై గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న చెన్నై ఫేవరేట్‌గా ఫైనల్లో బరిలో దిగనుంది.

ఐపీఎల్ 11వ సీజన్‌కు మరి కొద్ది సేపటిలో తెరపడబోతుంది. రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై మూడో సారి ట్రోఫీ గెలుచుకోవాలని ఉవ్విల్లూరుతోంది. మరో పక్క రెండో సారి కప్ గెలుచుకొని అన్ని జట్లతో సమానమయ్యేందుకు సిద్ధమైంది.

1
43470

అనూహ్యంగా కెప్టెన్ మారినా అంచనాలకు మించి ప్రదర్శన చూపించి హైదరాబాద్ జట్టును ఫైనల్ వరకూ చేర్చాడు. ఆరంభంలో దూకుడు చూపించిన ధావన్ ఆ మధ్యలో కాస్త తగ్గినా.. మళ్లీ పుంజుకుని జట్టుకు బలంగా మారాడు. అయితే బౌలర్ రషీద్ ఖాన్ లీగ్‌కు అసలు సిసలైన మజా రుచి చూపించాడు.

తానొక్కడై నిలిచి జట్టుకు వెన్నెముకగా మారి బలం చేకూరుస్తున్నాడు. హైదరాబాద్ జట్టు ప్రధాన బలం బౌలింగ్ కాగా, బౌలర్లలో కీలకమైన వ్యక్తి రషీద్. ఈ మ్యాచ్‌లో రషీద్‌తో తోడుగా భువనేశ్వర్‌, సిద్ధార్ధ్‌ కౌల్‌, షకిబ్‌ అల్‌ హసన్‌ కూడా జోరు సాగిస్తే చెన్నైని తక్కువ పరుగులకే కట్టడి చేయవచ్చు.

Story first published: Sunday, May 27, 2018, 22:59 [IST]
Other articles published on May 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X