న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై మ్యాచ్ ఉంటేనే ఎక్కువ మంది చూస్తున్నారట..!!

IPL 2018: Chennai Super Kings strike gold in the viewership rankings

హైదరాబాద్: రెండేళ్ల నిషేదం అనంతరం ఐపీఎల్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అజేయంగా దూసుకుపోతోంది. ప్రస్తుత సీజన్‌లో 12మ్యాచ్‌లు ఆడి 8గెలిచి లీగ్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. జట్టు పరంగానూ, వ్యక్తిగతంగానూ చెన్నై ఆటగాళ్ల ప్రదర్శనకు అద్భుతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. అప్పటికీ సొంత గడ్టపై నిర్వహించాల్సిన మ్యాచ్‌లను కావేరి జలాల వివాదం నేపథ్యంలో పూణె స్టేడియంలో నిర్వహిస్తూనే చెన్నై వాసులంతా ప్రత్యేక రైలుపై వచ్చి చూసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఓ పక్క ధోనీపై అభిమానం, అతనిపై ఉన్న నమ్మకంతో ప్రతి ఒక్కరినీ మ్యాచ్ జరుగుతోన్న సమయంలో స్టేడియం వైపే కళ్లు ఉంచేలా చేస్తున్నాయి. మంచి బ్యాటింగ్ బలగంతో ఉన్న చెన్నై జట్టుకు టీవీల ద్వారా వీక్షించే వాళ్లూ ఎక్కువగానే ఉన్నారు. ఐపీఎల్ 11వ సీజన్‌లో పాల్గొంటున్న ఎనిమిది ఫ్రాంచైజీలలో చెన్నై జట్టు మ్యాచ్ చూసేందుకు భారీగా వీక్షకులు మొగ్గు చూపుతున్నారంట.

Team
Views
CSK (9) 263871
MI (9) 240725
KKR (9) 220051
RCB (8) 217631
DD (9) 191912
KXIP (8) 189515
SRH (8) 174383
RR (8) 161253

బార్క్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై జట్టు వీక్షకులు 263.87మిలియన్ మంది వీక్షకులను సంపాదించుకుంది. లీగ్‌ను టీవీల ద్వారా వీక్షించే వారిలో కేవలం భారత్ లోనే 31శాతం మంది ఉన్నారట. ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో తలపడిన చెన్నై ప్లేఆఫ్ రేసులోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఇంతకుముందే ఆ అర్హత పొందడం, లీగ్‌లో టాప్ స్థానంలో కొనసాగుతున్న మ్యాచ్‌తో పోటీ కావడంతో అందరిలోనూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

మే 13ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో 4వికెట్ల నష్టానికి 179పరుగులు చేసింది. చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 2 ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై తన తదుపరి మ్యాచ్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ మే 18న తలపడనుంది.

Story first published: Tuesday, May 15, 2018, 15:29 [IST]
Other articles published on May 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X