న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫైనల్‌కు సిద్ధమవుతూ నిరాశను బయటపెట్టిన ధోనీ..

IPL 2018: Chennai Super Kings Happy to Have Played at Home Once At Least, Says MS Dhoni

హైదరాబాద్: తుది సమరానికి సమయం ఆసన్నమైంది. వాంఖడే స్టేడియం వేదికగా హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగనుంది. ఉత్కంఠభరితంగా మొదలై అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్‌ను ఫ్రాంచైజీలన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని లీగ్‌లో పాల్గొన్నాయి. ఏ అంచాలు లేకపోయినా.. కొత్త కెప్టెన్ అరంగ్రేటంతో హైదరాబాద్ జట్టు కొత్త ఉత్తేజాన్ని అందుకుంది.

టార్గెట్ ఏదైనా సరే తమదైన శైలిలో దూసుకుపోతూ ఫైనల్‌కు చేరింది. ప్లేఆఫ్ దశను కూడా దాటుకుని ఫైనల్‌లో ఆడేందుకు సిద్ధమైన తరుణంలో చెన్నై కెప్టెన్ తన మనో భావాలను ఇలా పంచుకున్నాడు. ఎంఎస్‌ ధోని మీడియాతో షేర్‌ చేసుకున్న విషయాలను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అధికారిక ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది.

'ఆరంభంలో కాస్త టెన్షన్‌ ఉన్న మాట వాస్తవం. అయితే టోర్నీలో మ్యాచ్‌లు ఆడుతున్న కొద్దీ మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దాంతోపాటు చెన్నై ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా, ఎమోషనల్‌గా మారారు. అయితే రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు ఐపీఎల్‌ ఆడుతోంది. కానీ చెన్నైలో మ్యాచ్‌లు జరగకపోవడం మమ్మల్ని చాలా నిరాశకు గురిచేసింది. చెన్నై ఫ్యాన్స్‌ తమ సొంత మైదానంలో మా ఆటను చూడాలనుకున్నారు. అయితే ఒక్క గేమ్‌ ఆడినందుకైనా సంతోషంగా ఉన్నాం.'

'ప్రొఫెషన్‌ పట్ల అంకిత భావంతో ఉన్నవారు ఎక్కడైనా రాణిస్తారన్న నమ్మకం మాకుంది. టీమ్‌ ఏ ఒక్కరిపైనా ఆధారపడకుండా సమష్టిగా ఆడితే తమదే విజయమని' ధోని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ వారు పోస్ట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఆడిన 9 సీజన్లు చెన్నైకి కెప్టెన్‌గా చేసిన ధోని తమ జట్టును 7 సార్లు ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. అందులో రెండుసార్లు ధోని చెన్నైని విజేతగా నిలిపాడు.

Story first published: Sunday, May 27, 2018, 10:26 [IST]
Other articles published on May 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X