'ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచేలా ఓ ఐడియా ఇవ్వండి'

Posted By:
IPL 2018: Cheeky Kieron Pollard asks media to advise Mumbai Indians

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో మ్యాచ్‌ గెలిచేందుకు ఓ ఐడియా ఇవ్వాలంటూ ముంబై ఇండియన్స్‌ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌ మీడియాను కోరాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో​ ఆఖరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | ముంబై ఇండియన్స్

టోర్నీలో భాగంగా మంగళవారం సొంతగడ్డపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో కీరన్ పొలార్డ్ మీడియాతో మాట్లాడుతూ 'ఆడిన మూడు మ్యాచుల్లో మేం చివరి ఓవర్లోనే ఓడిపోయాం. ఇలా మళ్లీ జరగకుండా ఓ ఐడియా చెప్పండి. మీకు క్రికెట్‌ గురించి బాగా తెలుసు కాబట్టి చివర్లో ఏం చేయాలో చెప్పండి' అని మీడియాని అడిగాడు.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లతో ఆడగా... ఈ మూడు మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్లలోనే ఓటమి పాలైంది. 'మేం దిగువ స్థాయిలో​ ఉన్నామని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలానుకుంటే మాత్రం.. మేం ఇంటికి వెళ్లాల్సిందే. మా పని అయిపోయినట్లే' అని పొలార్డ్ అన్నాడు.

'గత రెండు మ్యాచుల్లో (సన్‌రైజర్స్‌, చెన్నైలపై) 9 వికెట్లు పడగొట్టాం. చివరి వికెట్‌ తీస్తే విజయం మాదే కానీ అదే ఎలాసాధించాలో మేం మెరుగు పరుచుకోవాలి. 190 పరుగుల లక్ష్య చేధన ఎవరికైనా కష్టమే. కానీ సాధ్యమైంది' అని వెల్లడించాడు.

ఈ సీజన్‌లో తన వ్యక్తిగత ప్రదర్శనపై కూడా పొలార్డ్ స్పందించాడు. 'నా ప్రదర్శన పట్ల చింతించడం లేదు. ప్రతి క్రికెటర్‌ సరిగా రాణించకపోతే ఇబ్బంది పడుతారు. కానీ నేను ఆడిన మూడు మ్యాచుల్లో ఒకదానిలో బ్యాటింగ్‌ రాలేదు. రెండో మ్యాచ్‌లో కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చా. మూడో గేమ్‌లో విఫలమయ్యాను' అని అన్నాడు.

'నేనెప్పుడు​ అద్భుతంగా రాణించాలనే ఆకలితో ఉన్న క్రికెటర్‌నే. ప్రతి క్రికెటర్‌కు అద్భుత ప్రదర్శన అవసరం. ఎంత పెద్ద జట్టైనా.. ఎంత పెద్ద ఆటగాళ్లున్నా నాకనవసరం. ఇక పొలార్డ్‌ టైం వచ్చింది. లెక్కపెట్టుకోండి' అని ధీమా వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న మిగతా వెస్టిండిస్ క్రికెటర్ల ఆటతీరుపై పొలార్డ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో విండీస్‌ ఆటగాళ్లు రాణించండం సంతోషంగా ఉందని, గేల్‌ సునామీ ఇన్నింగ్స్‌ తనను ఆకట్టుకుందని పొలార్డ్‌ తెలిపాడు.

'మీరు గేల్‌ గురించి ప్రస్తావించినప్పుడు అత్యధిక టీ20 పరుగులు, గొప్ప రికార్డులు, సిక్సుల గురించి మాట్లాడుతారు. కానీ అలాంటి గేల్‌ను ఈ సీజన్‌ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చకపోవడం ఓ వెస్టిండియన్‌గా నాకు నిరాశను కలిగించింది. గేల్‌ ఆడిన తొలి గేమ్‌.. అతనెంటో తెలియజేసింది. చివరకు యూనివర్స్‌ బాస్‌గా అతను ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు' అని పొలార్డ్ పేర్కొన్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 17, 2018, 17:26 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి