ఆ తరహా ప్రదర్శనను ఎప్పుడూ చూడకూడదు: కోహ్లీ ఆవేదన

Posted By:

హైదరాబాద్: రైజింగ్ పూణెతో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాభవాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తట్టుకోలేకపోతున్నాడు. ఆ తరహా ప్రదర్శనను ఎప్పుడూ చూడకూడదని అనుకుంటున్నట్లు కోహ్లీ ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

జట్టులోని ఏ ఒక్క ఆటగాడు ఆశించిన మేరకు రాణించకపోవడంపై ఎంతో బాధించిందని కోహ్లీ అన్నాడు. 'ఒక కెప్టెన్‌గా ఆ తరహా ప్రదర్శనను జీర్ణించుకోవడం చాలా కష్టం. అటువంటి ప్రదర్శనల గురించి మాట్లాడటానికి కూడా ఏమీ ఉండదు. ఆ మ్యాచ్ మేము ఎలా ఓడిపోయామో అందరూ చూశారు' అని కోహ్లీ అన్నాడు.

Virat Kohli

'ఈ సీజన్ ప్రదర్శన నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మేము ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నాం. పది మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్‌కు ఎలా వెళతాం. ఇక మిగిలిన గేమ్‌లను ఎంజాయ్ చేస్తూ ఆడటం మాత్రమే మా పని. ఇక నుంచైనా గెలుపు కోసం శ్రమిస్తే మంచిది' అని చెప్పుకొచ్చాడు.

మా జట్టు గెలవడం కంటే ఓడిపోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఉందని, అందుకే వరుసగా పరాజయం పాలయ్యామని కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్‌లో భాగంగా పూణెతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె లక్ష్యాన్ని సాధించే క్రమంలో చేతులెత్తేసింది.

నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 96 పరుగులు చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే బెంగళూరు జట్టులోని పది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Story first published: Monday, May 1, 2017, 23:14 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి