మా ఓటమికి కారణం అదే: గంభీర్ విశ్లేషణ ఇదీ

Posted By:

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా ఆదివరం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తాము చేజేతులా చేసిన తప్పులే తమను ఓటమి ముందు నిలిచేలా చేశాయని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అన్నాడు. 48 పరుగుల తేడాతో తాము ఓడిపోవడం వెనుక కీలక సమయాల్లో క్యాచ్ డ్రాప్‌లు ఉన్నాయని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్: వార్నర్ విధ్వంసం, కోల్‌కతాపై ఘన విజయం

నగరంలోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో హైదరాబాద్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ గంభీర్ మీడియాతో మాట్లాడాడు.

వార్నర్ ఇచ్చిన క్యాచ్‌లను పట్టుకోవడంలో

వార్నర్ ఇచ్చిన క్యాచ్‌లను పట్టుకోవడంలో

డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌లను పట్టుకోవడంలో ఆటగాళ్లు వైఫల్యం చెందారని, ఇది తాము భారీ మూల్యాన్ని చెల్లించేలా చేసిందని అన్నాడు. పదో ఓవర్‌లో వార్నర్ క్యాచ్‌ని క్రిస్ వోక్స్ జారవిడిచాడని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. తమ ఆటగాళ్లు ఫీల్డింగ్‌ను మరింతగా మెరుగు పరచుకోవాల్సి ఉందన్నాడు.

మరింత ఏకాగ్రతతో ఫీల్డింగ్ చేయాలి

మరింత ఏకాగ్రతతో ఫీల్డింగ్ చేయాలి

మరింత ఏకాగ్రతతో ఫీల్డింగ్ చేయాలని సూచించాడు. ‘మా ఫీల్డింగ్‌ని కొంత మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అనవసర తప్పిదాల ద్వారా మ్యాచ్‌ను చేజార్చుకున్నాం. క్యాచ్‌లు పట్టడం ద్వారా విజయాలు సాధించవచ్చు. వార్నర్‌ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ క్యాచ్‌ వదిలిపెట్టడం ద్వారానే మ్యాచ్‌ను చేజార్చుకున్నాం' అని గంభీర్‌ అన్నాడు.

ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది

ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది

టోర్నీలో భాగంగా సొంతగడ్డపై ఈడెన్‌ గార్డెన్స్‌లో తమ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని చెప్పాడు. ఈ రెండింట్లో జట్టు మంచి ప్రదర్శన చేస్తుందని గంభీర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక, ఈ రెండు గేముల్లో ఏ ఒక్కటి గెలిచినా కోల్‌కతాకు ప్లే ఆఫ్‌ అవకాశాలు ఉంటాయి.

రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్‌కు

రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్‌కు

రెండు మ్యాచ్‌లు గెలిస్తే, ఆ జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు అవకాశాలు కూడా ఇదే విధంగా ఉండగా, మూడు, నాలుగు స్థానాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణె జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఆదివారం కోల్‌కతాపై డేవిడ్‌ వార్నర్‌ 59 బంతుల్లో 126 పరుగులతో సెంచరీ చేశాడు.

హ్యాట్రిక్‌ విజయాల తర్వాత కోల్‌కతా ఓటమి

హ్యాట్రిక్‌ విజయాల తర్వాత కోల్‌కతా ఓటమి

ఈ క్రమంలో వార్నర్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో, సెంచరీ ముంగిట ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోల్ కతా ఆటగాడు క్రిస్ వోక్స్‌ వదిలేశాడు. తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతోన్న కోల్‌కతా హ్యాట్రిక్‌ విజయాల తర్వాత ఓటమిని చవిచూసింది.

Story first published: Monday, May 1, 2017, 15:12 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి