న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండు రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ముగుస్తుందా? భారత్‌పై ఐసీసీ చర్యలు తీసుకోవాలి: పాక్ మాజీ క్రికెటర్

Inzamam-ul-Haq wants the ICC to take action after Ahmedabad pitch controversy
India V England: ICC To take Action On India & Ahmedabad Pitch - Inzamam-Ul-Haq | Oneindia Telugu

కరాచీ: భారత్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్ట్ రెండు రోజుల్లో ముగియడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజుమామ్ ఉల్ హక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ టెస్ట్ క్రికెట్‌లానే అనిపించలేదని, ఆ మ్యాచ్ కంటే టీ20 స్కోర్ కార్డ్స్ ఎంతో నయమని తెలిపాడు. మొతెరా పిచ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఇంజుమామ్ ఉల్ హక్.. భారత్ తీరును కూడా తప్పుబట్టాడు. ఇలాంటి పిచ్‌లు భవిష్యత్తులో తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరాడు.

6 ఓవర్లలో 5 వికెట్లా?

6 ఓవర్లలో 5 వికెట్లా?

'ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ 6 ఓవర్లలోనే ఐదు వికెట్లు తీసాడంటేనే పిచ్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జోరూటే (5/8) ఐదు వికెట్లు తీసినప్పుడు అశ్విన్, అక్షర్ పటేల్‌ను ఎందుకు ప్రశంసించాలి? టెస్ట్ మ్యాచ్‌ అంటే చాలా అంశాలు ఉంటాయి. వేదిక, గ్రౌండ్, అంపైర్, రిఫరీ ఇవన్నీ భాగమే. కాబట్టి పిచ్‌కు కూడా కొంత ప్రాముఖ్యత ఉండాలి. టెస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్‌లాగే ఉండాలి.

టీ20లు నయం..

టీ20లు నయం..

అహ్మదాబాద్ టెస్ట్ కంటే టీ20 మ్యాచ్‌ల స్కోర్ కార్డ్ ఎంతో నయం. కనీసం రెండు రోజులు కూడా పూర్తిగా ఆడలేని ఈ పిచ్‌పై ఐసీసీ చర్యలు తీసుకోవాలి. ఒక రోజు పూర్తవ్వకుండానే 17 వికెట్లు పడ్డాయంటే.. ఆ పిచ్ ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. అలాంటి పిచ్‌పై ఎలా ఆడుతారు. హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవడాన్ని, స్పిన్ ట్రాక్‌లను తయారుచేయడాన్ని నేను తప్పుబట్టడం లేదు. కానీ మరీ ఇంత దారుణమైన పిచ్‌లను మాత్రం నేను సహించలేను.'అని ఇంజుమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.

భారత్ భారీ విజయం..

భారత్ భారీ విజయం..

ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ రఫ్ఫాడించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు ఆలౌటవ్వగా.. భారత్ 33 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్ 49 పరులుగు లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా చేధించి 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నందుకుంది.

గెలిస్తే ఫైనల్‌కు..

గెలిస్తే ఫైనల్‌కు..

ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగానే గురువారం నుంచి ప్రారంభంకానుంది. కోహ్లీ సేన ఈ సిరీస్‌‌‌‌ను 2-1 లేదా 3-1తో గెలిస్తే లార్డ్స్‌‌‌‌ వేదికగా జరగబోయే మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌‌‌‌తో తలపడుతుంది. అలా కాకుండా ఇంగ్లండ్‌‌‌‌ 2-2తో సిరీస్‌‌‌‌ను సమం చేస్తే మాత్రం ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌ చేరుతుంది. అందువల్ల ఈ టెస్టును టీమిండియా లైట్‌‌‌‌ తీసుకోవడానికి లేదు. బుమ్రాకు రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌తోపాటు ఓపెనింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌, మూడో స్పిన్నర్‌‌‌‌ స్థానాలు నాలుగో‌‌‌ టెస్ట్‌‌‌‌కు ముందు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ముందున్న సవాళ్లు.

Story first published: Wednesday, March 3, 2021, 14:50 [IST]
Other articles published on Mar 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X