న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌కు పోటీ ఇవ్వడం కాదు.. ఓడిస్తాం.. మా జట్టులో నా మాటే శాసనం: జింబాబ్వే బ్యాటర్

Innocent Kaia Predicts Zimbabwe To Win ODI Series 2-1 against India

హరారే: బంగ్లాదేశ్‌తో టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న జింబాబ్వే అదే జోరులో తమ కంటే పదింతలు పటిష్టమైన టీమిండియాను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండ్ ఇన్నో సెంట్ కియా కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. భారత జట్టుకు పోటీ ఇవ్వడం కాదు.. కచ్చితంగా ఓడిస్తామని చెప్పాడు. ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి భారత్ పతనాన్ని శాసిస్తానని, జట్టులో తన మాటే శాసనమని పేర్కొన్నాడు. ఇక వెస్టిండీస్ పర్యటనను ఘనంగా ముగించిన టీమిండియా..ఆసియా కప్ ముందు మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.

ద్వితీయ శ్రేణి టీమ్..

ద్వితీయ శ్రేణి టీమ్..

అయితే ఈ పర్యటనకు ద్వితీయ శ్రేణితో కూడిన జట్టును బీసీసీఐ జింబాబ్వే పర్యటనకు పంపింది. ఆసియా కప్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లందరికి విశ్రాంతినిచ్చింది. ముందుగా శిఖర్ ధావన్‌ను ఈ పర్యటనకు కెప్టెన్ చేసిన బీసీసీఐ.. చివరి నిమిషంలో కేఎల్ రాహుల్‌ను ఈ జట్టులో చేర్చి సారథిగా నియమించింది. అయితే టాప్ క్రికెటర్లు లేకపోవడం తమకు అడ్వాంటేజ్ అని ఇన్నోసెంట్ కియా తెలిపాడు. బంగ్లాపై గెలుపులో కీలక పాత్ర పోషించిన ఇన్నోసెంట్‌ టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కచ్చితంగా గెలుస్తాం..

కచ్చితంగా గెలుస్తాం..

'టీమిండియాతో సిరీస్‌లో జింబాబ్వే 2-1తో గెలుస్తుంది. ఇక వ్యక్తిగతంగా.. వరుస సెంచరీలు సాధించాలని నేను కోరుకుంటున్నా. తద్వారా టాప్‌ స్కోరర్‌గా నిలవాలని భావిస్తున్నా. భారత్‌తో సిరీస్‌లో నా ప్రధాన లక్ష్యం అదే. మేము కచ్చితంగా గెలుస్తామని నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే.. ప్రస్తుత భారత జట్టులో విరాట్‌ కోహ్లీ లేడు.. రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌ వంటి కీలక ఆటగాళ్లంతా విశ్రాంతిలో ఉన్నారు. వాళ్లు లేకున్నా మా దేశానికి వచ్చిన జట్టు పటిష్టమైనదే అని నాకు తెలుసు. వాళ్లను తక్కువగా అంచనా వేసే ఉద్దేశం మాకు లేదు. అయితే.. మేం మాత్రం పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.'' అని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఆడింది మూడు వన్డేలే..

ఆడింది మూడు వన్డేలే..

కియా వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. అద్భుత విజయాలతో దూసుకుపోతున్న తీరు ప్రశంసనీయమని, కానీ భారత్‌ను తక్కు అంచనా వేస్తూ ఇలా మాట్లాడటం సరికాదని సూచిస్తున్నారు. హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో కియా 110 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక గతేడాది స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కియా.. ఈ ఏడాది జూన్‌లో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌తో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు.

ఇప్పటి వరకు జింబాబ్వే తరఫున 6 వన్డేలు ఆడి 245 పరుగులు సాధించాడు. అత్యధి​క స్కోరు 110. ఇక టీ20 ఫార్మాట్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 119 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 54. జింబాబ్వే కోచ్‌ డేవిడ్‌ హౌన్‌, టెక్నికల్‌ డైరెక్టర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ సైతం భారత్‌కు గట్టిపోటీనిస్తామని తెలిపాడు.

Story first published: Monday, August 15, 2022, 14:50 [IST]
Other articles published on Aug 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X