న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సోషల్ మీడియాలోనూ కోహ్లీ హవా.. సచిన్, ధోనీలను మించి ఫాలోవర్లు

Virat Kohli Ahead Of Sachin Tendulkar, MS Dhoni On Social Media || Oneindia Telugu
Indian Captain Virat Kohli ahead of Sachin Tendulkar, MS Dhoni as most followed cricketer on social media

ఢిల్లీ: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసి 11 ఏళ్లు అవుతోంది. ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ ఈ 11 ఏళ్లలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, బ్రియాన్ లారా లాంటి వారి రికార్డులను అధిగమించాడు. కోహ్లీ (20,018) ఈ దశాబ్దంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా రికార్డు సాధించాడు. ఇదిలా ఉంటే.. కోహ్లీ సోషల్ మీడియాలోనూ టాప్‌గా నిలిచాడు.

<strong>ఫిరోజ్‌షా కోట్లలో 'విరాట్ కోహ్లీ' స్టాండ్‌!!</strong>ఫిరోజ్‌షా కోట్లలో 'విరాట్ కోహ్లీ' స్టాండ్‌!!

అక్కడా కోహ్లీ టాప్‌:

అక్కడా కోహ్లీ టాప్‌:

రికార్డులు తిరగరాయడంలో ముందువరుసలో ఉండే విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలోనూ తన హవా కొనసాగిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఏ క్రికెటర్‌కూ లేనంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కోహ్లీ సంపాదించుకున్నాడు. సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మించి అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ట్విటర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో విడివిడిగా 30 మిలియన్ల ఫాలోవర్స్‌ను కోహ్లీ కలిగి ఉన్నాడు.

 కోహ్లీ తర్వాత సచిన్‌, ధోనీ:

కోహ్లీ తర్వాత సచిన్‌, ధోనీ:

కోహ్లీ తర్వాత సచిన్‌ ఉన్నాడు. సచిన్‌ ట్విటర్‌లో 30.1 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 28 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 16.5 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాను అంతగా ఉపయోగించకున్నా మూడో స్థానంలో నిలిచాడు. ట్విటర్‌లో 7.7 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 20.5 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 15.4 మిలియన్ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నాడు. రోహిత్‌ శర్మ, సురేశ్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్ సింగ్‌లు ఈ జాబితాలో వరుసగా ఉన్నారు. ఎనిమిదో స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఉండగా.. తొమ్మిదవ స్థానంలో శిఖర్‌ ధావన్‌, పదో స్థానంలో క్రిస్‌ గేల్ ఉన్నారు.

బీసీసీఐకి ఈ మెయిల్‌.. భారత క్రికెట్‌ జట్టుకు ఉగ్రముప్పు!!

స్టాండ్‌కు కోహ్లీ పేరు:

స్టాండ్‌కు కోహ్లీ పేరు:

అంతర్జాతీయ కెరీర్‌లో 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా డిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్ అసోషియేషన్‌ (డీడీసీఎ) విరాట్ కోహ్లీని గౌరవించింది. డిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరును పెట్టింది. మాజీలు ఆటగాళ్లు బిషన్‌ సింగ్‌ బేడీ, మొహిందర్‌ అమర్‌నాథ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లకు కూడా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో స్టాండ్‌లు ఉన్నాయి. వీరందరూ రిటైర్మెంట్‌ తర్వాత ఆయా స్టాండ్‌లకు వారి పేర్లు పెట్టారు. కానీ కోహ్లీ ఆటలో కొనసాగుతుండగానే.. డీడీసీఎ కోట్ల మైదానంలోని ఓ స్టాండ్‌కు పేరు పెట్టడం విశేషం.

Story first published: Monday, August 19, 2019, 12:27 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X