బీసీసీఐకి ఈ మెయిల్.. భారత క్రికెట్ జట్టుకు ఉగ్రముప్పు!!

కూలిడ్గ్: ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు భద్రతకు ఉగ్రముప్పు పొంచి ఉందని బీసీసీఐకి ఆదివారం ఓ ఈ మెయిల్ రావడంతో కలకలం రేపింది. దీంతో బీసీసీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అది తప్పుడు మెయిల్ అని నిర్ధారించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఏదేమైనా ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ బెదిరింపు అంశాన్ని ఆంటిగ్వాలోని భారత హై కమిషన్ వర్గాలు అక్కడి ప్రభుత్వానికి తెలియజేశాయి.

కట్టుదిట్టమైన భద్రత:
తప్పుడు మెయిల్ వచ్చిన నేపథ్యంలో భారత హైకమిషన్.. అక్కడి స్థానిక ప్రభుత్వ యంత్రంగాన్ని అప్రమత్తం చేసిందని, భారత ఆటగాళ్లకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసిందని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకుంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఆటగాళ్ల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఉందని, అవసరమైతే మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆ అధికారి చెప్పారు.

పట్టు బిగించిన భారత్:
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విండీస్ ‘ఎ' జట్టుతో టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడుతూ 200 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 35 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. రహానే (20), విహారి (48) క్రీజులో ఉన్నారు.
181 పరుగులకే విండీస్ ఆలౌట్.. పట్టుబిగించిన భారత్

22 నుంచి టెస్టు సిరీస్:
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 181 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో టీమిండియాకు 116 పరుగుల ఆధిక్యం లభించింది. కావెం హాడ్జ్ (51; 100 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ సాధించగా.. జొనాథన్ కార్టర్ (26; 35 బంతుల్లో 2X4, 1X6), హామిల్టన్ (33; 72 బంతుల్లో 4X4) రాణించారు. భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (21/3), ఉమేశ్‌యాదవ్ (19/3), కుల్‌దీప్ యాదవ్ (35/3) చెలరేగడంతో.. టీ విరామానికి ముందు విండీస్ 56.1 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి రోజు శనివారం 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. అయితే ఆదివారం ఇదే స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సోమవారం ఈ ప్రాక్టీస్ మ్యాచ్ పూర్తవుతుండగా.. ఈనెల 22 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications