For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టీ20.. కౌర్‌సేన అదే జోరును కొనసాగిస్తుందా!!

India Women vs South Africa Women, 1st T20I: Dream11, Playing XI, Weather Report, Pitch Report & Injury Update

సూరత్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పురుషుల భారత జట్టు 1-1తో సమం చేసింది. ఇక టెస్ట్ సిరీస్ కోసం సిద్దమయింది. మరోవైపు భారత మహిళల జట్టు కూడా దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో అమితుమీ తేల్చుకోనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో పర్యాటక దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. ఇటీవలి కాలంలో దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం చెలాయిస్తున్న భారత మహిళలు అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.

గత ఐదు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా మహిళలపై భారత మహిళలు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఐదు మ్యాచ్‌లలో భారత్ మూడు విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇప్పుడు సొంతగడ్డపై సఫారీలతో తలపడడం భారత్‌కు అదనపు బలం. మరోవైపు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత్ ఫామ్‌లో ఉంది. అయితే సౌతాఫ్రికాను ఏమాత్రం తేలిగ్గా తీసుకొనే అవకాశం లేదు. ఎందుకంటే.. ఆదివారం జరిగిన రెండో వామప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు చేతిలో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్ జట్టు 83 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా పూర్తి ఆత్మవిశ్వసంతో బరిలోకి దిగనుంది.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత జట్టు బలంగా కనిపిస్తోంది. అయితే స్మృతి మందన, వేదా కృష్ణమూర్తి, హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. మంధాన శుభారంభం అందిస్తే.. వేద, రోడ్రిగ్స్‌ ధనాధన్‌ ఆటతో స్కోరు బోర్డును పరిగెత్తించే అవకాశం ఉంది. సీనియర్ మిథాలీ రాజ్ టీ20ల నుంచి రిటైరవడంతో.. జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు శిఖా పాండే, పూజతో పాటు స్పిన్నర్లు పూనమ్, అనూజ సఫారీలను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Teams:
South Africa Women Squad: Lizelle Lee(w), Tazmin Brits, Laura Wolvaardt, Nadine de Klerk, Sune Luus(c), Lara Goodall, Nondumiso Shangase, Anne Bosch, Ayabonga Khaka, Shabnim Ismail, Mignon du Preez, Sinalo Jafta, Tumi Sekhukhune, Nonkululeko Mlaba.

India Women Squad: Smriti Mandhana, Shafali Verma, Jemimah Rodrigues, Harmanpreet Kaur(c), Veda Krishnamurthy, Deepti Sharma, Taniya Bhatia(w), Shikha Pandey, Radha Yadav, Arundhati Reddy, Poonam Yadav, Anuja Patil, Mansi Joshi, Pooja Vastrakar, Harleen Deol.

Story first published: Tuesday, September 24, 2019, 10:52 [IST]
Other articles published on Sep 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+