న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Women vs England Women: స్నేహ్ రాణా అసమాన పోరాటం.. డ్రాతో గట్టెక్కిన మిథాలీ సేన!

India Women vs England Women: Sneh Rana Shines On Day 4 As India Secure Draw Against England

బ్రిస్టల్‌: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్‌ చిరస్మరణీయ డ్రాతో గట్టెక్కింది. ఓటమిని తప్పించుకోవాలంటే రోజంతా ఆడాల్సిన స్థితిలో భారత మహిళా క్రికెటర్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. ఫాలో ఆన్‌ ఆడుతూ ఓ దశలో ఓటమి దిశగా సాగిన టీమిండియాను అరంగేట్రం ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా (154 బంతుల్లో 13 ఫోర్లతో 80 నాటౌట్‌), తానియా భాటియా (88 బంతుల్లో 6 ఫోర్లతో 44 నాటౌట్‌) శతక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. వీరికి అండగా టెయిలండర్ శిఖా పాండే (50 బంతుల్లో 3 ఫోర్లతో 18)పోరాడింది.దాంతో భారత్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

83/1తో ఆఖరి, నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 344/8 పరుగులు చేసింది. మొత్తంగా భారత్‌ అదనంగా 179 పరుగుల ఆధిక్యం సాధించింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు 12 ఓవర్లు ముందుగానే డ్రాకు అంగీకరించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన షెఫాలీకి 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' దక్కింది.

పోరాడిన స్నేహ్ రాణా

పోరాడిన స్నేహ్ రాణా

చివరి రోజు ఆటలో టీ విరామానికి భారత్‌ 8 వికెట్లకు 243 పరుగులతో కష్టాల్లో పడింది. కీలక బ్యాటర్లంతా పెవిలియన్‌ చేరారు.. ఓటమి తప్పదేమో అనిపించింది! కానీ ఎనిమిదో స్థానంలో వచ్చిన స్నేహ్‌ రాణా, పదో నంబర్‌ బ్యాటర్‌ తానియా భాటియా తో కలిసి అసాధారణంగా పోరాడింది.

ఒకవైపు ఓవర్లు కరిగిస్తూనే పరుగులు రాబట్టిన ఈ జోడీ చివరి సెషన్‌ అంతా వికెట్‌ చేజార్చుకోకుండా ఆడటంతో ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. ఒక దశలో 171/2తో మెరుగైన స్థితిలో కనిపించింది. షెఫాలీవర్మ (63) ఔటైనా.. దీప్తిశర్మ (54), పూనమ్‌ రౌత్‌ (39) ఇన్నింగ్స్‌ను నడిపించారు. కానీ దీప్తి ఔటయ్యాక భారత పతనం ప్రారంభమైంది.

శతక భాగస్వామ్యం..

శతక భాగస్వామ్యం..

ఇంగ్లండ్‌ స్పిన్నర్లు ఎకిల్‌స్టోన్‌ (4/118), నటాలియా (2/21) విజృంభించడంతో భారత్‌ 28 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి 199/7తో కష్టాల్లో పడిపోయింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (4), హర్మన్‌ ప్రీత్‌ (8) స్వల్ప స్కోర్లకే ఔట్‌ కాగా.. కాసేపు నిలిచిన శిఖా పాండే (18) కూడా వెనుదిరగడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతో సమయం పట్టదనిపించింది. కానీ అనూహ్యంగా ఎదురు నిలిచిన స్నేహ్‌-తానియా అబేధ్యమైన తొమ్మిదో వికెట్‌కు 104 పరుగులు జత చేసి జట్టును ఓటమి నుంచి బయటపడేశారు ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఈనెల 27న మొదలవుతుంది.

సంక్షిప్త స్కోర్లు

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 396/9 డిక్లేర్డ్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 231 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 344/8 (121 ఓవర్లలో)

Story first published: Sunday, June 20, 2021, 9:48 [IST]
Other articles published on Jun 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X