అవగాహన కల్పించేందుకు భూటాన్ వెళ్లిన సచిన్ దంపతులు

న్యూ ఢిల్లీ: ఇండియన్ గాడ్ ఆఫ్ క్రికెట్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు భూటాన్ దేశానికి వెళ్లారు. ఆయన రాకతో భూటాన్ దేశం ఉప్పొంగిపోయింది. సతీసమేతంగా భూటాన్ రాజధాని తింపూ చేరిన సచిన్‌కు అక్కడి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, దేశ అధికార ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. సచిన్ రాకతో భూటాన్ స్కూల్ పిల్లలు, యువతరం క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.

క్రికెట్ జట్టు సభ్యులకు క్రికెట్ పాఠాలు
యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ (యూనిసెఫ్) బ్రాండ్ అంబాసిడర్ హోదాలో చిన్నారులకు పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు తింపూలో పర్యటించారు. స్కూల్ పిల్లలు, చిన్నారులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. భూటాన్ జాతీయ బాలురు, బాలికల క్రికెట్ జట్టు సభ్యులకు క్రికెట్ పాఠాలు చెప్పారు.
కోహ్లీ Vs రోహిత్, ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్?: భజ్జీ చెప్పిన సమాధానం ఇదీ!

భోజనం తినే ముందు చేతులు శుభ్రంగా ఉంటే
జిలూఖాస్ స్కూల్‌లో సందడి చేసిన క్రికెట్ గాడ్ అక్కడి విధ్యార్ధులతో చాలా సేపు గడిపారు. వారికి ఆటలు పూర్తి అయిన తర్వాత చేతులు ఎలా శుభ్రంగా వాష్ చేసుకోవాలో చూపించడంతో పాటు చేతులు పరిశుభ్రంగా ఉంటే కలిగే లాభాలు వివరించారు. భోజనం తినే ముందు చేతులు శుభ్రంగా ఉంటే ఎన్నో రోగాలను రాకుండా అరికట్టవచ్చంటూ చిన్నారులకు విలువైన సలహాలిచ్చారు.

స్కూల్ పిల్లలతో ఆడి వారి ఆనందాన్ని
స్కూల్ పిల్లలతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడి వారి ఆనందాన్ని పంచుకున్నారు. భూటాన్ క్రికెట్ అకాడమీలోనూ సచిన్ కొద్దిసేపు హల్‌చల్ చేశారు. జాతీయ బాలురు, బాలికల క్రికెట్ జట్టు సభ్యులు ఇండియన్ గాడ్ ఆఫ్ క్రికెట్ రాకతో సంబరపడిపోయారు.

భూటాన్ మధురానుభూతులను మిగిల్చిందని
యువతరం క్రికెటర్లకు క్రికెట్ పాఠాలు చెప్పడంతో పాటు కాసేపు సరదాగా క్రికెట్ ఆడి ఆకట్టుకున్నారు. భూటాన్ పర్యటన ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందని సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో ఫోటోలు పోస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications