న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుణె వన్డేలో సెంచరీ: హ్యాట్రిక్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన కోహ్లీ

Virat Kohli

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. వెస్టిండీస్‌తో పుణె వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనూ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ సిరిస్‌లో కోహ్లీకి ఇది మూడో సెంచరీ. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

అంతేకాదు ఒకే ప్రత్యర్థిపై వరసగా నాలుగు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో 140 (107 బంతుల్లో), విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో 157 నాటౌట్ (129 బంతుల్లో) చెలరేగిన సంగతి తెలిసిందే.

తాజాగా పుణె వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడో వన్డేలోనూ 110 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్‌ సాయంతో కెరీర్‌లో 38వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒకే జట్టుపై వరసగా నాలుగు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు. హోల్డర్‌‌ వేసిన 38 ఓవర్‌ తొలి బంతికే సింగిల్‌ రాబట్టిన కోహ్లీ వన్డేల్లో 38వ సెంచరీని సాధించాడు.

1
44268
వన్డేల్లో కోహ్లీ 38వ సెంచరీ

వన్డేల్లో కోహ్లీ 38వ సెంచరీ

ఈ మ్యాచ్‌లో కోహ్లీ మినహా మిగతా టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌(8), ధావన్‌ (35), రాయుడు (22), పంత్‌ (24), ధోని(7)లు విఫలమయ్యారు. దీంతో భారత్‌ 194 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టుకు విజయాన్నందించాలని పట్టుదలతో ఆడుతున్నాడు.

 39 ఓవర్లకు భారత్ 207/5

39 ఓవర్లకు భారత్ 207/5

మరోవైపు విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పోరు రసవత్తరంగా మారింది. ప్రస్తుతం 39 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కోహ్లీ(103), భువనేశ్వర్ కుమార్(3) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 9 వికెట్లకు 283 పరుగులు చేసింది.

 దేశం తరుపున వన్డేల్లో వరుసగా సెంచరీలు సాధించిన ఆటగాళ్లు:

దేశం తరుపున వన్డేల్లో వరుసగా సెంచరీలు సాధించిన ఆటగాళ్లు:

5 బాబర్ అజాం in UAE, 2016-17

4 ఏబీ డివిలియర్స్ in Ind, 2010-11

4 విరాట్ కోహ్లీ in Ind, 2017-18

3 జహీర్ అబ్బాస్ in Pak, 1982-83

3 సయీద్ అన్వర్ in UAE, 1993

3 క్వింటన్ డీకాక్ in SA, 2013

3 కుమార సంగక్కర in Aus, 2015

 భారత్ తరుపున విరాట్ కోహ్లీ గత నాలుగు ఇన్నింగ్స్‌లు:

భారత్ తరుపున విరాట్ కోహ్లీ గత నాలుగు ఇన్నింగ్స్‌లు:

113(106) v NZ, Kanpur

140(107) v WI, Gauhati

157(129)*v WI, Vizag

100(110)*v WI, Pune

Story first published: Saturday, October 27, 2018, 21:37 [IST]
Other articles published on Oct 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X