న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాపై ట్విటర్‌లో ప్రశంసల జల్లు

India vs West Indies: Twitterati label hapless visitors Waste Indies after suffering innings loss at Rajkot

రాజ్‌కోట్: వెస్టిండీస్‌పై సునాయాస విజయం సాధించిన టీమిండియాపై ట్విటర్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్‌ 272 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. పర్యాటక జట్టు రెండు సార్లు బ్యాటింగ్‌ చేసినా ఫాలోఆన్ ‌స్కోరు దాటకపోవడం గమనార్హం. దీంతో రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసింది. కుల్‌దీప్‌ యాదవ్‌ 5 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

ఎప్పట్లాగే టీమిండియా సొంతగడ్డపై చెలరేగిపోయింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారీ విజయంతో ఆరంభించింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 272 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మూడో రోజు, శనివారం 94/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌.. 181 పరుగులకే కుప్పకూలింది. తర్వాత ఫాలోఆన్‌ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ పోరాట పటిమ చూపలేదు. 196 పరుగులకే చేతులెత్తేసింది.

టెస్టుల్లో ఐదు వికెట్ల ఘనత తొలిసారి సాధించిన కుల్‌దీప్‌కు అభినందనలు.

అంతా ముగియడానికి కేవలం 8 సెషన్ల సమయం పట్టింది. టీమిండియా సమష్టి బౌలింగ్‌ దాడి ఆకట్టుకుంది.

ఇదో సులభ విజయం. రెండు సార్లు బ్యాటింగ్‌ చేసినా విండీస్‌ ఫాలోఆన్‌ స్కోరు దాటలేదు. పృథ్వీషా, నిర్భయంగా ఆడిన పంత్‌ను ఈ మ్యాచ్‌ ద్వారా గుర్తుంచుకుంటాం.

అద్భుత విజయం. పృథ్వీషా నుంచి అద్భుత ఇన్నింగ్స్‌!

వెస్టిండీస్‌ అంటే గుర్తొచ్చేది దిగ్గజ క్రికెటర్లు, ఫాస్ట్‌ బౌలర్లు, దమ్మున్న బ్యాట్స్‌మెన్‌, మైదానం నిండిపోయే అభిమానులు, సరదా, క్రికెట్‌పై గౌరవం, స్లెడ్జింగ్‌ లేకపోవడం, మంచి సంగీతం. ఇప్పటి విండీస్‌ ఒకప్పటి వెస్టిండీస్‌లా మారుతుందని ఆశిస్తున్నా.

వెస్టిండీస్‌ క్రికెట్‌ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. వారితో ఆడాలంటేనే జట్లు భయపడ్డ రోజులున్నాయి. ఆ జట్టుకు మంచి ఆటగాళ్లు లభిస్తారని అంతర్జాతీయస్థాయిలో గట్టి పోటీ ఇస్తారని ఆశిస్తున్నా.

ఇది నిజమైన కాంపిటేషన్. చాలా బాగా ఆడిన భారత్ సునాయాసంగా గెలిచింది. ప్రతి ఒక్కరికీ ఇదొక మంచి గేమ్.

Story first published: Sunday, October 7, 2018, 10:31 [IST]
Other articles published on Oct 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X