న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీనేజ్‌లోనే టీమిండియాలోకి అరంగ్రేటం చేసిన క్రికెటర్లు

India vs West Indies: Prithvi Shaw and other teenage debutantes for India

హైదరాబాద్: 1955 తర్వాత మరో టీనేజర్ టీమిండియాకు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో భాగంగా పృథ్వీ షా అరంగ్రేటం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా తలపడుతోన్న టీమిండియాకు ఓపెనర్‌గా పృథ్వీ 18 ఏళ్ల 330రోజుల వయస్సుతో బరిలోకి దిగాడు. గతంలో 1955వ సంవత్సరంలో 17ఏళ్ల 265రోజుల వయస్సున్న విజయ్ మెహ్రా ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో అరంగ్రేటం చేశాడు. షా తో పాటు టీమిండియాలోకి అరంగ్రేటం చేసిన వారిలో మరి కొందరిపేర్లు మచ్చుకు..

<strong>INDvWI: లంచ్ విరామానికి టీమిండియా స్కోరు 133/1</strong>INDvWI: లంచ్ విరామానికి టీమిండియా స్కోరు 133/1

సచిన్ టెండూల్కర్ 16ఏళ్లు

సచిన్ టెండూల్కర్ 16ఏళ్లు

టీనేజ్ అరంగ్రేటం చేసిన వారిలో మంచి పేరెన్నికగన్నవాడు సచిన్. అతను 16 ఏళ్ల 205రోజులకే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 1989లో పాకిస్తాన్‌లోని కరాచీ వేదికగా తన తొలి మ్యాచ్‌ను ఆడాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 15పరుగులు మాత్రమే చేసిన టెండూల్కర్ మరో అరంగ్రేట క్రికెటర్ వఖార్ యూనిస్ చేతిలో అవుటయి పెవిలియన్ చేరాడు.

పార్థివ్ పటేల్ 17ఏళ్లు

పార్థివ్ పటేల్ 17ఏళ్లు

2002 సంవత్సరంలో టీమిండియాలోకి అరంగ్రేటం చేసిన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్. తొలుత అప్పటి ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ నాజర్ హుస్సేన్ పార్థివ్‌ను స్కూలు పిల్లాడు మైదానంలోకి వచ్చాడని భావించాడట. ఆ తర్వాత ట్రెంట్ బ్రిడ్జ్‌ స్టేడియంలో అతని మ్యాచ్ ముగిశాక టెస్టు చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిగా నిలిచిపోయాడు.

దినేశ్ కార్తీక్ 20 ఏళ్లు

దినేశ్ కార్తీక్ 20 ఏళ్లు

టీనేజర్ స్థానంలో టీనేజర్‌గా దినేశ్ కార్తీక్ మైదానంలోకి వచ్చాడు. 2004 నవంబరు 4న ముంబై వేదికగా ఆస్ట్రేలియా ఆడుతోన్న మ్యాచ్‌లో కార్తీక్ అరంగ్రేటం చేశాడు. గ్లోవ్స్‌తో పార్థివ్ పటేల్ అంతగా రాణించలేకపోవడంతో కార్తీక్ ఆ స్థానంలోకి వచ్చాడు.

నరేంద్ర హిర్వానీ 19 ఏళ్లు

నరేంద్ర హిర్వానీ 19 ఏళ్లు

మధ్యప్రదేశ్‌కు చెందిన లెగ్ స్పిన్నర్.. చెన్నై వేదికగా జరిగిన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లో ఎనిమిది చొప్పున (8/61, 8/75) పదహారు వికెట్లు తీశాడు. గతంలో బాబ్ మస్సీ పేరిట ఉన్న 8/137పరుగుల రికార్డును అరంగ్రేట మ్యాచ్‌తోనే చెరిపేశాడు.

హర్భజన్ సింగ్ 18 ఏళ్లు

హర్భజన్ సింగ్ 18 ఏళ్లు

పంజాబ్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 1998లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న మ్యాచ్‌లో అరంగ్రేటం చేశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సిరీస్ ఇప్పటికీ ఆస్ట్రేలియా జట్టుకు గుర్తుండిపోయేలా ముగిసింది.

 కపిల్ దేవ్ 20ఏళ్లు

కపిల్ దేవ్ 20ఏళ్లు

పాకిస్తాన్‌ ప్రత్యర్థిగా జరిగిన మ్యాచ్‌లో సహీవాల్ ఎక్స్‌ప్రెస్ కపిల్ దేవ్ 1978లో ఫైసల్‌బాద్ వేదికగా అరంగ్రేటం చేశాడు. 'డ్రా'గా ముగిసిన ఈ మ్యాచ్‌లో ఓ వికెట్ తీశాడు. అంతేగాక, పాకిస్తాన్ ఓపెనర్ సాదిఖ్ మొహమ్మద్ హెల్మెట్‌ను బంతితో కొట్టాడు. అంతకుముందున్న బౌలింగ్ శైలిలో మార్పు వచ్చి ఫేస్‌లో వైవిధ్యాన్ని నెలకొల్పాడు ఆల్ రౌండర్ కపిల్ దేవ్.

 అనిల్ కుంబ్లే 19 ఏళ్లు

అనిల్ కుంబ్లే 19 ఏళ్లు

లెగ్ స్పిన్నర్‌‌గా అరంగ్రేటం చేసిన అనిల్ కుంబ్లే టీమిండియా బౌలింగ్‌లో కొత్త ఒరవడి సృష్టించాడు. కర్ణాటక ప్రాంతానికి చెందిన కుంబ్లే మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లోనే కుంబ్లే మూడు వికెట్లు తీశాడు.

యువరాజ్ సింగ్ 19 ఏళ్లు

యువరాజ్ సింగ్ 19 ఏళ్లు

వన్డేల ద్వారా అంతర్జాతీయ జట్టులోకి అరంగ్రేటం చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్. కెన్యాతో తలపడిన మ్యాచ్‌లో కెరీర్ ఆరంభించిన యువీ.. 4వికెట్లను 16పరుగులిచ్చి అవుట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో గంగూలీ, ద్రవిడ్, కాంబ్లీలు ఉన్న నేపథ్యంలో యువీకి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.

1
44264
Story first published: Thursday, October 4, 2018, 13:28 [IST]
Other articles published on Oct 4, 2018
Read in English:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X