గంగూలీ రికార్డు బ్రేక్.. ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ

IND V WI 2019, 1st Test : Virat Kohli Overtakes Ganguly, Equals MS Dhoni In Multiple Captaincy Feats

అంటిగ్వా: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న అరుదైన రికార్డును సమం చేసాడు. టెస్టు క్రికెట్లో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన ధోనీ రికార్డును తాజాగా కోహ్లీ సమం చేశాడు. తొలి టెస్టులో వెస్టిండీస్‌పై 318 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించడంతో కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ఇక విదేశీ గడ్డలపై అత్యధిక విజయాలు అందించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును కోహ్లీ అధిగమించాడు.

100 పరుగులకు ఆలౌట్.. వెస్టిండీస్‌ ఖాతాలో చెత్త రికార్డు!!

ధోనీ రికార్డును సమం:

ధోనీ రికార్డును సమం:

ధోనీ తన కెరీర్‌లో 60 టెస్టులకు సారథిగా వ్యవహరించి 27 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోనీనే కొనసాగుతుండగా.. తాజాగా విజయంతో కోహ్లీ సమం చేసాడు. ఇప్పటి వరకు 47 టెస్టులకు నాయకత్వం వహించిన కోహ్లీ.. 27 మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలు అందించి ధోనీ సరసన నిలిచాడు. ధోనీ రికార్డును అధిగమించేందుకు కోహ్లీ ఒక్క గెలుపు దూరంలో మాత్రమే నిలిచాడు. సౌరభ్‌ గంగూలీ కెప్టెన్సీలో భారత్‌ 49 టెస్టుల్లో 21 గెలువగా.. మహ్మద్‌ అజారుద్దీన్‌ సారథ్యంలో 47 మ్యాచ్‌ల్లో 14 గెలుపొందింది.

 గుంగూలీ రికార్డు బ్రేక్:

గుంగూలీ రికార్డు బ్రేక్:

విదేశాల్లో టీమిండియాకు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కాడు. కోహ్లీ నాయకత్వంలో టీమిండియాకు విదేశాల్లో ఇది 12వ (26 టెస్టుల్లో) విజయం. తాజా విజయంతో గంగూలీ కెప్టెన్సీలో సాధించిన 11 (28 టెస్టుల్లో) విజయాల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. కోహ్లీ, గుంగూలీ తర్వాతి స్థానాల్లో ధోనీ (6 విజయాలు, 30 టెస్టుల్లో), రాహుల్ ద్రవిడ్ (5 విజయాలు, 17 టెస్టుల్లో) ఉన్నారు.

7 పరుగులు 5 వికెట్లు:

7 పరుగులు 5 వికెట్లు:

జస్ప్రీత్ బుమ్రా (5/7) విజృంభించడంతో 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ 100 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా దెబ్బకు ఓపెనర్లు బ్రాత్‌వైట్‌ (1), క్యాంప్‌బెల్‌ (7).. డారెన్‌ బ్రావో (2), హోప్‌ (2), హోల్డర్‌ (8)లు పెవిలియన్ బాట పట్టారు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 7 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు ఓవర్లు మెయిడిన్ కావడం విశేషం. బుమ్రా ఈ అద్భుత గణాంకాలతో.. ఐదు వికెట్లు తీసి తక్కువ పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా నిలిచాడు.

కెప్టెన్సీ ఓ బాధ్యత.. దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నా: కోహ్లీ

 ఆసియా మొదటి బౌలర్:

ఆసియా మొదటి బౌలర్:

బుమ్రా నాలుగు సార్లు 5 వికెట్లు సాధించి చిరస్మరణీయంగా నిలిచాడు. ఇప్పటివరకు నాలుగు వేర్వేరు పర్యటనలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్) 5 వికెట్ హాల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారత బౌలర్. అంతేకాదు ఆ నాలుగు దేశాలలో ఐదు వికెట్లు పడగొట్టిన ఆసియా మొదటి బౌలర్ కూడా. ఈ నాలుగు దేశాలలో మొట్టమొదటి పర్యటనలోనే 5 వికెట్ హాల్ సాధించడం మరో విశేషం.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, August 26, 2019, 13:57 [IST]
Other articles published on Aug 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X