న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ తలొంచింది.. టిక్కెట్ల కోతను తగ్గించింది!!

India vs West Indies: BCCI reduces its complimentary passes to half

న్యూఢిల్లీ: భారత్‌, వెస్టిండీస్‌ మధ్య అక్టోబరు 24న ఇండోర్‌లో జరగాల్సిన రెండో వన్డే వైజాగ్‌లోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగే అవకాశముంది. కాంప్లిమెంటరీ టికెట్ల రగడ ఎంతకీ తెగకపోవడంతో ఇండోర్‌ ఆతిథ్య హక్కులను వదులుకుంది. బీసీసీఐ నూతన నిబంధనల ప్రకారం స్టేడియం కెపాసిటీలో 90 శాతం టికెట్లను పబ్లిక్ సేల్‌కు అందుబాటులో ఉంచాలి. పది శాతం సీట్లే కాంప్లిమెంటరీ టికెట్లుగా మిగులుతాయి.

రాష్ట్ర సంఘాల అసంతృప్తిని దృష్టిలో

రాష్ట్ర సంఘాల అసంతృప్తిని దృష్టిలో

నిబంధనలను సడలించుకుని రాష్ట్ర సంఘాల ఆగ్రహానికి బీసీసీఐ తలొగ్గింది. వెస్టిండీస్‌తో జరిగే మిగతా మ్యాచ్‌లకు తన కోటాలోని 600 టికెట్లకు కోత పెట్టుకోనుంది. కాంప్లిమెంటరీ టికెట్లలో సగం వాటా కావాలని బీసీసీఐ కోరడంతో రాష్ట్ర సంఘాల అసంతృప్తిని దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ పరిపాలన కమిటీ (సీవోఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మేమైతే ఈ విషయంలో రాజీ పడం

మేమైతే ఈ విషయంలో రాజీ పడం

ఈ వివాదంతోనే ఇండోర్‌లో జరగాల్సిన రెండోవన్డేకు ఆతిథ్యం ఇవ్వలేనని ఎంపీసీఏ తెగేసి చెప్పడంతోపాటు కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సైతం విభేదించాడు. కాంప్లిమెంటరీల విషయంలో బీసీసీఐ ఏం చేయాలనుకుంటోందో అర్థం కావడం లేదు. మ్యాచ్‌ను తరలించాలనుకుంటే తరలించనివ్వండి. మేమైతే ఈ విషయంలో రాజీ పడం' అని గంగూలీ అన్నాడు.

1200 టికెట్లనుంచి 600కు తగ్గించి

1200 టికెట్లనుంచి 600కు తగ్గించి

కొత్తగా అమల్లోకి వచ్చిన బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం 90 శాతం టికెట్లను వీక్షకులకే కేటాయించాలి. మిగిలిన పదిశాతం టికెట్లు మాత్రమే రాష్ట్ర సంఘాలకు కాంప్లిమెంటరీ పాస్‌లుగా మిగలనున్నాయి. స్పాన్సర్ల కోసం ఇందులో సగం కేటాయించాలని బీసీసీఐ కోరవడంతో రాష్ట్ర సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో సమావేశమైన సీవోఏ ..బీసీసీఐ కోరిన 1200 టికెట్ల కోటా నుంచి దాదాపు 600 టికెట్లను తగ్గించి రాష్ట్ర సంఘాలకు ఊరట కల్పించింది.

 హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా

దీంతో బీసీసీఐకి హాస్పిటాలిటీ విభాగంలో 184, పెవిలియన్ విభాగంలో 420 కాంప్లిమెంటరీ పాస్‌లను మాత్రమే వినియోగించనుంది. ఈ సడలింపు క్యాబ్‌లాంటి సంస్థలకు బెనిఫిట్‌గా మారింది. ఈ నేపథ్యంలో వారికి మరిన్ని ఫ్రీ టికెట్లు దక్కనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాబోయే శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు వన్డే, టీ20 సిరీస్‌లో పోటీ పడనున్నాయి.

Story first published: Sunday, October 7, 2018, 12:42 [IST]
Other articles published on Oct 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X