న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Vs West Indies: ఆంటిగ్వాలో అర్ధనగ్నంగా కోహ్లీసేన (ఫోటో)

 India Vs West Indies: Ahead of Test Championship, Virat Kohli enjoys beach party with teammates in Antigua

హైదరాబాద్: భారత క్రికెటర్లు బీచ్ పార్టీలో ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా నార్త్‌ సౌండ్‌లో సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో విండిస్‌తో గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.

తొలి టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్లు బీచ్ పార్టీలో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోని కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. "బాయ్స్‌తో బీచ్ వద్ద అద్భుతమైన రోజు" అంటూ విరాట్ కోహ్లీ కామెంట్ కూడా పెట్టాడు.

కరేబియన్ అంటేనే అందమైన దీవులకు పుట్టినిల్లు. అక్కడి ప్రకృతి సోయగాలు మైమరపింపజేస్తాయి. వన్డే సిరిస్ ముగిసిన తర్వాత టెస్టు సిరిస్‌కు ఆరంభానికి ముందు కాస్త విరామ సమయం దొరకడంతో టీమిండియా కరేబియన్ దీవులను చుట్టేస్తోంది.

<strong>PKL 2019: పుణెరి పల్టన్‌పై బెంగళూరు బుల్స్ ప్రతీకారం తీర్చుకునేనా?</strong>PKL 2019: పుణెరి పల్టన్‌పై బెంగళూరు బుల్స్ ప్రతీకారం తీర్చుకునేనా?

కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రహానే, బుమ్రా, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లతో పాటు సహాయక బృందాన్ని కూడా మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. ఐసీసీ ప్రతిషాత్మకంగా ప్రవేశపెట్టిన టెస్టు చాంపియన్‌షిప్‌ను టీమిండియా వెస్టిండిస్‌ పర్యటనతో ప్రారంభించనుంది.

View this post on Instagram

Stunning day at the beach with the boys 🇮🇳👌😎

A post shared by Virat Kohli (@virat.kohli) on

కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ

రాబోయే రెండేళ్లు జరగనున్న ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లు తలపడుతాయి. మొత్తం 27 సిరీసుల్లో ఆయా జట్లు మొత్తం 71 టెస్టులు ఆడనున్నాయి. ఈ మధ్య కాలంలో టెస్టు క్రికెట్‌లో పోటీ రెండింతలైందని కోహ్లీ అన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ "క్రికెట్ గేమ్‌లో మరింత పోటీ పెరిగింది. ఇది టెస్టు క్రికెట్‌కు ఓ ఉద్దేశం తీసుకొచ్చింది. సరైన సమయంలో సరైన చర్య" అని సోమవారం విండిస్ ప్లేయర్ల అసోయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో అన్నాడు.

టెస్టు క్రికెట్‌ చనిపోయే దశకు

టెస్టు క్రికెట్‌ చనిపోయే దశకు

"టెస్టు క్రికెట్‌ చనిపోయే దశకు చేరుకుంటుందని ప్రజలు అంటున్నారు. నా వరకైతే రెండేళ్లుగా టెస్టు క్రికెట్‌లో పోటీ రెండింతలైంది. విజయాల కోసం ఛాలెంజెస్‌ను ఎదుర్కోవడం అనేది ఆటగాళ్లను బట్టి ఉంటుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ పెట్టిందే అందుకు. రాబోయే రోజుల్లో బోరు కొట్టే డ్రాలు లేకుండా ఉత్కంఠకరమైన డ్రాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అదనపు పాయింట్లు కావాలి కదా" అని కోహ్లీ అన్నాడు.

వెస్టిండిస్‌ పర్యటనతో టెస్టు చాంపియన్‌షిప్‌

వెస్టిండిస్‌ పర్యటనతో టెస్టు చాంపియన్‌షిప్‌

టెస్టు చాంపియన్‌షిఫ్‌లో భాగంగా ఇకపై టీమిండియా ప్రతి టెస్టు ఎంతో కీలకం. టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగంగా 2021 జూన్‌ వరకు పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు లార్డ్స్ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ ఆడతాయి. వెస్టిండిస్ గడ్డపై విండిస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తారు. వారి బౌలింగ్‌ స్థాయికి తగినట్టు ఆడాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్‌కు ఉందని కోహ్లీ తెలిపాడు.

కోహ్లీ మరో అరుదైన రికార్డు

కోహ్లీ మరో అరుదైన రికార్డు

ఇదిలా ఉంటే, ఈ టెస్టు సిరిస్‌లో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని చేరువయ్యాడు. కోహ్లీ ఒక్క సెంచరీని సాధిస్తే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ రికీ పాంటింగ్‌(19) సమం చేస్తాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 18 సెంచరీలతో పాంటింగ్‌ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

క్రికెటర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట: జీవితకాల నిషేధం ఎత్తివేత

టెస్టుల్లో 25 సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ

టెస్టుల్లో 25 సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ

ఈ జాబితాలో సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్‌ స్మిత్‌(25) తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ విషయానికి వస్తే టెస్టుల్లో మొత్తం 25 సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో కెప్టెన్‌గా 18 సెంచరీ సాధించాడు. ఇక విండిస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోని రికార్డును విరాట్ కోహ్లి బద్దలు కొడతాడు. కోహ్లీ 46 టెస్టులకు కెప్టెన్సీ వహించగా 26 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది.

Story first published: Wednesday, August 21, 2019, 12:41 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X