న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పూణెలో మూడో వన్డే: ప్రివ్యూ, ఎక్కడ చూడాలి, టైమింగ్, కీలక ఆటగాళ్లు

India Vs West Indies 2018, 3rd ODI : Match Preview And Main Players | Oneindia Telugu
India vs West Indies, 3rd ODI: Preview, where to watch, timings, key facts

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య పూణె వేదికగా శనివారం(అక్టోబర్ 27)న మూడో వన్డే జరగనుంది. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో విండిస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.... రెండో వన్డే‌ మాత్రం టైగా ముగించింది.

క్రికెట్ పట్ల అంపైర్ అలీందార్ నిబద్ధత: వీడియో వైరల్, ప్రశంసల వర్షంక్రికెట్ పట్ల అంపైర్ అలీందార్ నిబద్ధత: వీడియో వైరల్, ప్రశంసల వర్షం

ప్రస్తుతం ఐదు వన్డేల సిరిస్‌లో కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ఎలాగైనా సరే మూడో వన్డేలో విజయం సాధించి ఈ సిరిస్‌లో మరింత ఆధిక్యాన్ని సాధించాలని కోహ్లీసేన భావిస్తోండగా... మరోవైపు పర్యాటక వెస్టిండిస్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరిస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో మూడో వన్డే ప్రివ్యూని ఒక్కసారి పరిశీలిస్తే...:

 1. రన్ మెషిన్ - టీమిండియా - విరాట్ కోహ్లీ

1. రన్ మెషిన్ - టీమిండియా - విరాట్ కోహ్లీ

వెస్టిండిస్‌తో జరుగుతున్న ఈ సిరిస్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. ఈ సిరిస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని సైతం అందుకున్నాడు. తద్వారా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సైతం అధిగమించాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా కోహ్లీకి 205 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్ర సింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరాడు.

2. షిమ్రోన్ హెట్‌మెయిర్ - వెస్టిండిస్

2. షిమ్రోన్ హెట్‌మెయిర్ - వెస్టిండిస్

ఈ సిరిస్‌లో వెస్టిండిస్ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆటగాడు షిమ్రోన్ హెట్‌మెయిర్. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో 94 పరుగులు చేసిన హెట్‌మెయిర్ రెండో వన్డేలో సెంచరీ సాధించి జట్టుని ఓటమి నుంచి తప్పించాడు. ముఖ్యంగా భారత స్పిన్నర్లపై తన అధిపత్యాన్ని ప్రదర్శించి వెస్టిండిస్ మాజీ దిగ్గజాలను గుర్తు చేస్తున్నాడు. పూణె వన్డేలో కూడా హెట్‌మెయిర్ మరోసారి విజృంభించే అవకాశం లేకపోలేదు.

 3. మళ్లీ జట్టులోకి భువనేశ్వర్ కుమార్/జస్ప్రీత్ బుమ్రా - ఇండియా

3. మళ్లీ జట్టులోకి భువనేశ్వర్ కుమార్/జస్ప్రీత్ బుమ్రా - ఇండియా

వెస్టిండిస్‌తో జరగనున్న మిగతా మూడు వన్డేలకు ప్రకటించిన జట్టులో ప్రధాన పేస్ బౌలర్లు భువనేశ్వర్‌కుమార్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. తొలి రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులిచ్చిన షమీని సెలక్టర్లు పక్కన బెట్టారు. విశాఖ వన్డేలో భారత బౌలర్లు తేలిపోయిన నేపథ్యంలో భారత బౌలింగ్ దళాన్ని మరింత పటిష్టం చేసేందుకు సెలక్టర్లు ఈ ఇద్దరికీ చోటు కల్పించారు. చివరి మూడు వన్డేలకు జట్టులో భువనేశ్వర్, బుమ్రా ఇద్దరూ రావడంతో భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది.

 4. పిచ్, ప్రభావం దాని పరిస్థితులు

4. పిచ్, ప్రభావం దాని పరిస్థితులు

పూణె పిచ్ బ్యాటింగ్‌కు అనకూలం. బౌండరీ దూరం తక్కువగా ఉండటంతో ఈ స్టేడియంలో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక, బౌలర్లు సైతం లైన్ అండ్ లెంత్‌తో బంతులు విసిరితేనే వికెట్లు దక్కించుకోగలరు. లేదంటే పరుగుల వరద పారడం ఖాయం. మరోవైపు రాత్రి వేళల్లో మంచు కురుస్తుండటం కారణంగా టాస్ కీలకం కానుంది.

 5. ప్రత్యక్ష ప్రసారం, టైమింగ్స్

5. ప్రత్యక్ష ప్రసారం, టైమింగ్స్

స్టార్ నెట్ వర్క్‌లో మధ్యాహ్నాం 1.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం.

హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్

Story first published: Friday, October 26, 2018, 16:21 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X