న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గువహటిలో తొలి వన్డే: షిమ్రాన్ హెట్‌మయెర్ సెంచరీ

India vs West Indies, 1st ODI: Windies Crumble After Shimron Hetmyer Ton, Yuzvendra Chahal Shines For India

హైదరాబాద్: గువహటి వేదికగా భార‌త్‌తో జరుగుతున్న తొలి వ‌న్డేలో వెస్టిండీస్ షిమ్రాన్ హెట్‌మయెర్ సెంచరీ సాధించాడు. 74 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వన్డేల్లో అతనికిది మూడోది కావడం విశేషం. ఈ సెంచరీతో భారత్‌పై అత్యంత వేగంగా సెంచరీ సాధించిన నాలుగో విండీస్‌ బ్యాట్స్‌మన్‌గా హెట్‌మెయిర్‌ అరుదైన ఘనత సాధించాడు.

 72 బంతుల్లో సెంచరీ సాధించి తొలి స్థానంలో

72 బంతుల్లో సెంచరీ సాధించి తొలి స్థానంలో

ఈ జాబితాలో వివ్‌ రిచర్డ్స్‌ 72 బంతుల్లో సెంచరీ సాధించి తొలి స్థానంలో ఉండగా.. రికార్డో పావెల్‌ సైతం 72 బంతుల్లోనే ఈ ఫీట్‌ను సాధించి ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. సామ్యూల్స్‌ 73 బంతుల్లో సెంచరీ సాధించగా... తాజాగా హెట్‌మెయిర్‌ 74 బంతుల్లో సెంచరీ సాధించాడు. తద్వారా వెస్టిండిస్‌ తరపున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.

 13 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు

13 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు

మూడు సెంచరీలు చేసేందుకు గాను హెట్‌మయెర్‌కు 13 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. వివ్‌ రిచర్డ్స్‌‌కు 16, గ్రీనిడ్జే 27, సిమన్స్‌ 41 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఇక హెట్‌మెయిర్‌కు భారత్‌తో ఇదే తొలి వన్డే మ్యాచ్‌ కావడం విశేషం. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నప్పటికీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అలవోకగా బౌండరీలు బాదేశాడు.

 106 పరుగుల వద్ద రిషబ్ పంత్‌కు క్యాచ్

106 పరుగుల వద్ద రిషబ్ పంత్‌కు క్యాచ్

మొత్తం 78 బంతులు ఎదుర్కొన్న హెట్‌మయెర్ 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగుల వద్ద రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మహ్మద్ షమీ వేసిన 38వ ఓవర్లో భారీ సిక్స్ బాది సెంచరీ పూర్తి చేశాడు. ముఖ్యంగా స్పిన్‌ బౌలర్లను హెట్‌మయెర్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఒత్తిడిలో కూడా అతడు రాణించిన తీరు అద్భుతం.

 భారత్ విజయ లక్ష్యం 323

భారత్ విజయ లక్ష్యం 323

జాసన్ హోల్డర్(19) సహకారం అందిస్తుండటంతో వేగంగా ఆడే క్రమంలో జడేజా బౌలింగ్‌లో బౌండరీలైన్ వద్ద రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, హెట్‌మెయిర్‌ (106), కీరన్‌ పావెల్‌ (51), హోప్‌ (32), హోల్డర్‌ (38)లు రాణించడంతో భారత్‌కు 323 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు. భారత బౌలర్లలో చాహల్‌కు మూడు, షమీ, జడేజాలకు రెండు, ఖలీల్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ తీశాడు.

Story first published: Sunday, October 21, 2018, 18:34 [IST]
Other articles published on Oct 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X