న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka:రెండో భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డు

ICC Cricket World Cup 2019 || India Vs Sri Lanka || Bumrah Second Fastest Indian To 100 ODI Wickets
India vs Sri Lanka: Jasprit Bumrah Second Fastest Indian to 100 ODI Wickets

హైదరాబాద్: లీడ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె(10: 17 బంతుల్లో 2ఫోర్లు)ను బుమ్రా పెవిలియన్ పంపాడు. నాలుగో ఓవర్‌లో బుమ్రా వేసిన నాలుగో బంతిని షాట్ ఆడబోగా బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ ధోనీ చేతిలో పడింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో జట్టు స్కోరు 17 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. కరుణరత్నె వికెట్‌తో వన్డేల్లో బుమ్రా 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు అతి తక్కువ వన్డేల్లో ఆ మైలురాయిని చేరుకున్న రెండో భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు.

టీమండియా తరఫున మహ్మద్ షమీ ఈ మైలురాయని 56 ఇన్నింగ్స్‌లో అందుకోగా.. బుమ్రా(57), ఇర్ఫార్ పఠాన్(59), జహీర్ ఖాన్(65), అజిత్ అగార్కర్(67), జవగళ్ శ్రీనాథ్(68) ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును అందుకున్నారు. కాగా, లంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు.

ప్రస్తుతం 12 ఓవర్లకు గాను శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. క్రీజులో ఏంజెలో మాథ్యూస్(2), లాహిరు తిరుమన్నే పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

Story first published: Saturday, July 6, 2019, 16:06 [IST]
Other articles published on Jul 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X