న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: హాఫ్ సెంచరీతో ద్రవిడ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

India vs South Africa 1st Test live score Day 4: Rohit Sharma hits 7th fifty in a row to set new Indian record

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ... రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డే తరహాలో ఆడుతున్న రోహిత్‌ కేవలం 72 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ఫలితంగా ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. సొంతగడ్డపై గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో 82, 51*, 102*, 65, 50*, 176, 50* ఏడుసార్లు యాభైకి పైగా స్కోరు సాధించి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 11వ హాఫ్‌సెంచరీ. భారత్‌ తరఫున మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్‌ ద్రావిడ్‌ ఆరుసార్లు ఈ ఘనత సాధించాడు.

బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన హర్భజన్: నిబంధనలు తెలుసంటూ బుకాయింపు!బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన హర్భజన్: నిబంధనలు తెలుసంటూ బుకాయింపు!

టెస్టుల్లో ఓపెనర్‌గా

దీంతో పాటు టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ రెండో ఇన్నింగ్స్‌ 50 పరుగులు చేయడంతో మొత్తంగా ఈ టెస్టులో రోహిత్ శర్మ స్కోరు 226 పరుగులు దాటింది. ప్రస్తుతం 36 ఓవర్లకు గాను టీమిండియా 114/1 స్థితిలో ఉంది.

185 పరుగుల ఆధిక్యంలో

క్రీజులో రోహిత్ శర్మ(58), పుజారా(48) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 185 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌట్‌ కాగా భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద టీమిండియా మయాంక్ అగర్వాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.

7 పరుగులు చేసి ఔటైన మయాంక్

తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసిన మయాంక్‌ అగర్వాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులకే ఔటయ్యాడు. కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో డుప్లెసిస్‌‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

Story first published: Saturday, October 5, 2019, 13:59 [IST]
Other articles published on Oct 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X