న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: పాకిస్థాన్‌తో తలపడనున్న కోహ్లీసేన, తేదీ ఖరారు

ICC Announced Asia Cup List
India vs Pakistan on September 19 in Asia Cup 2018

హైదరాబాద్: పాకిస్థాన్‌, క్వాలిఫయర్‌తో పాటు భారత్‌ గ్రూప్‌-ఎలో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో సెప్టెంబరు 15న శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలపడతాయి. 28న ఫైనల్‌ జరుగుతుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి. అందులో టాప్‌-2 జట్లు ఫైనల్లో తలపడతాయి.

ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌-పాక్‌లు

ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌-పాక్‌లు

దాయాదీ దేశం పాకిస్తాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ అంటే భారత అభిమానులకు ఎక్కడి లేని ఉత్సాహం వస్తుంది. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదు. దీంతో ఆ ఉత్కంఠభరితమైన క్షణాలను అభిమానులు మిస్సవుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌-పాక్‌లు తలపడుతున్నాయి.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో రెండుసార్లు

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో రెండుసార్లు

గతేడాది జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఇలాంటి ఆసక్తికర మ్యాచ్‌ ప్రేక్షకులను రెండుసార్లు కనువిందు చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ గెలవగా.. అసలు సిసలు ఫైనల్‌ మ్యాచ్‌లో పాక్‌ నెగ్గి టైటిల్‌ నెగ్గిన విషయం తెలిసిందే. మళ్లీ అలాంటి మ్యాచ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. క్రికెట్‌ ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన భారత్‌, పాక్‌ జట్లు ముఖాముఖి పోరుకు సిద్దమయ్యాయి.

ఆసియాకప్‌ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ

ఆసియాకప్‌ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ

దుబాయ్‌, అబుదాబి వేదికలుగా జరిగే ఆసియాకప్‌ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఆసియాకప్‌ షెడ్యూలు విడుదలైంది. సెప్టెంబరు 19న భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొంటుంది. అంతకుముందు రోజు క్వాలిఫయర్‌ మ్యాచ్‌తో భారత్‌ తన టైటిల్‌ వేట ఆరంభిస్తుంది. భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లు ఇప్పటివరకు ఈ టోర్నీలో ఖరారైన జట్లు.

సెప్టెంబర్ 28న దుబాయ్‌ వేదికగా ఫైనల్

సెప్టెంబర్ 28న దుబాయ్‌ వేదికగా ఫైనల్

మరో స్థానం కోసం యూఏఈ, సింగపూర్‌, ఒమన్‌, నేపాల్‌, మలేసియా, హాంకాంగ్‌ పోటీపడతాయి. రెండు గ్రూప్‌లు విభజించగా.. ఒక్కో గ్రూపులో మూడు జట్లు తలపడగా టాప్-2లో నిలిచినవి సూపర్-4లోకి అడుగుపెడుతాయి. సెప్టెంబర్ 28న దుబాయ్‌ వేదికగా ఫైనల్ జరగనుంది.

Story first published: Wednesday, July 25, 2018, 12:19 [IST]
Other articles published on Jul 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X