న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్xపాక్: పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన రోహిత్ సేన, టార్గెట్ 238

shoaib-malik-batting-vs-india-15377082712

దుబాయి:టోర్నీలో చాలా మ్యాచ్‌లు అంచనాలకు అందని రీతిలో సాగిన నేపథ్యంలో రోహిత్‌ సేన అప్రమత్తంగా ఉండాల్సిందే. అందులోనూ పాకిస్థాన్‌ ఆట ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. రెండు జట్లూ ఒక్కో మ్యాచ్‌ గెలిచాయి కాబట్టి ఆదివారం నెగ్గే జట్టు దాదాపుగా ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంటుంది. భారత్‌కు నెట్‌ రన్‌రేట్‌ కూడా చాలా బాగుంది కాబట్టి పాక్‌ను మామూలుగా ఓడించినా ఫైనల్‌కు చేరిపోయినట్లే. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.

భారత్ టార్గెట్: 238

రెండో సారి భారత్‌తో తలపడేందుకు సిద్ధపడిన పాకిస్తాన్ భారీ ఎత్తులోనే పోరాటం చేసింది. అప్పటికే పాక్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు కట్టడి చేయడంతో పాకిస్తాన్‌ను నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులకు కట్టడి చేశారు. ఆ జట్టులో షోయబ్ మాలిక్ (78) 90 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులు హాఫ్ సెంచరీతో మెరిసినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నిరాశపరచడంతో పాక్‌ మరోసారి తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఊహించిన ఆరంభం పాక్‌కి లభించలేదు. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లోనే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (10)‌‌ని స్పిన్నర్ చాహల్‌ పెవిలియన్ బాట పట్టించగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫకార్ జమాన్ (31) 44 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సు, బాబర్ అజామ్ (9) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఫకార్ ఎల్బీడబ్ల్యూగా ఔటవగా.. అజామ్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనాటౌటయ్యాడు.

దీంతో.. పాకిస్థాన్ 15.5 ఓవర్లలో ముగిసే సమయానికి 58/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (44) 66 బంతుల్లో 2ఫోర్లతో కలిసి షోయబ్ మాలిక్ కీలక ఇన్నింగ్స్‌తో పాక్ జట్టుని ఆదుకున్నాడు. భారత బౌలర్లని సహనంతో ఎదుర్కొన్న మాలిక్ 64 బంతుల్లో కెరీర్‌లో 45వ హాఫ్ సెంచరీ అందుకుని ఆ తర్వాత బ్యాట్ ఝళిపించాడు. అయితే.. జట్టు స్కోరు 165 వద్ద కుల్దీప్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఔటవడంతో శతక భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ తర్వాత క్రమంగా మాలిక్ జోరు తగ్గించాడు. కానీ.. సర్ఫరాజ్ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆసిఫ్ అలీ (30) 21 బంతుల్లో ఒక సిక్సు, 2 సిక్సులు మాత్రం భారీ షాట్లతో చెలరేగాడు. ముఖ్యంగా.. భువనేశ్వర్ వేసిన ఓ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదేశాడు. ప్రమాదకరంగా మారిన అలీని చాహల్ పెవిలియన్ బాట పట్టించగా.. మాలిక్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. దీంతో.. ఒత్తిడిలో పడిన పాక్ ఆ తర్వాత చివరి వరకూ పుంజుకోలేకపోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్:

టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్‌తో గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయపడటంతో.. బంగ్లాపై అతడి స్థానంలో జడేజాను ఆడించారు. 14 నెలల తర్వాత వన్డే తుది జట్టులోకి వచ్చిన అతను అద్భుత ప్రదర్శన చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' గెలిచాడు. దీంతో అతడిని కొనసాగించక తప్పదు. మరి గత మ్యాచ్‌ మాదిరే ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తారా.. లేక చాహల్‌, కుల్దీప్‌ల్లో ఒకరిని పక్కన పెట్టి మూడో పేసర్‌ను తీసుకుంటారా అనేది ఆసక్తికరం.

స్పిన్నర్‌ను తగ్గించుకుని అదనపు బ్యాట్స్‌మన్‌గా మనీష్‌ పాండేను ఎంచుకునే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం. కీలక పోరులో మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఫహీమ్‌ అష్రాఫ్‌ స్థానంలో హరీస్‌ సొహైల్‌, షాదాబ్‌ ఖాన్‌ స్థానంలో మొహమ్మద్‌ నవాజ్‌ వచ్చే అవకాశాలున్నాయి. జట్టు బ్యాటింగ్‌కు షోయబ్‌ మాలిక్‌ వెన్నెముకలా ఉంటున్నాడు.

ఇమామ్‌ ఉల్‌ హక్‌, బాబర్‌ ఆజమ్‌ తమ స్థాయి ఆటను ప్రదర్శిస్తున్నా ఫఖర్‌ జమాన్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ కావడం ఆ జట్టును ఆందోళనపరుస్తోంది. పాక్ ప్రధాన బౌలర్‌ మొహ్మద్‌ అమీర్‌ పేలవ ఫామ్‌ పాక్‌ను దెబ్బతీస్తోంది. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో చోటు కోల్పోవాల్సి వచ్చింది. భారత్‌పై గెలవాలంటే పేసర్లు హసన్‌ అలీ, ఉస్మాన్‌ ఖాన్‌ రాణించాల్సి ఉంటుంది.

బరిలో జట్లు :

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, జస్ర్పీత్‌ బుమ్రా.

పాకిస్థాన్‌:ఫఖర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, బాబర్‌ ఆజమ్‌, షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ (కెప్టెన్‌), ఆసిఫ్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌, మొహమ్మద్‌ నవాజ్‌, హసన్‌ అలీ, మొహమ్మద్ అమీర్, షాహీన్‌ అఫ్రీది

పిచ్‌ వాతావరణ పరిస్థితి:
ఇక్కడ ఉపయోగించిన రెండు పిచ్‌లు నెమ్మదిగానే ఉన్నాయి. భారీ స్కోర్లు కష్టమే కాబట్టి 250కి పైగా పరుగులు చేస్తే పోటీ ఇవ్వవచ్చు. స్పిన్నర్లు రాణించే అవకాశముంది.

Story first published: Sunday, September 23, 2018, 21:16 [IST]
Other articles published on Sep 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X