న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్: ఇషాంత్ శర్మ అరుదైన రికార్డు

India vs New Zealand, 1st Test: Ishant Sharma grabs 11th five-wicket haul

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్‌ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇషాంత్ (5/68) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు జోరుకు బ్రేక్‌లు పడింది. మిగతా పేస్‌ బౌలర్లు విఫలమైన చోట ఇషాంత్‌ రాణించడంతో కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయకుండా 348 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, టామ్‌ బ్లన్‌డెల్‌, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌లతో పాటు టెయిలెండర్లు టిమ్‌ సౌతీ, ట్రెంట్‌ బౌల్ట్‌లను పెవిలియన్ చేర్చిన ఇషాంత్‌ ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో టెస్టుల్లో అత్యధిక ఐదు వికెట్లు తీసిన రెండో భారత పేసర్‌గా జహీర్‌ ఖాన్ సరసన నిలిచాడు. జహీర్‌ ఖాన్ 92 టెస్టుల్లో 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్‌ 97 టెస్టుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో కపిల్‌ దేవ్‌(23) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక విదేశీ గడ్డపై ఎక్కువ సార్లు ఐదు వికెట్లు(9) పడగొట్టిన మూడో టీమిండియా బౌలర్‌గా లంబూ నిలిచాడు.

ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కపిల్‌ దేవ్‌(12), అనిల్‌ కుంబ్లే(10)లు ఉన్నారు. ఇక కివీస్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు గాయపడ్డ ఇషాంత్.. ఈ టూర్‌లో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ పూర్తి ఫిట్ నెస్ సాధించి తుది జట్టులోకి వచ్చిన లంబూ అద్భతు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

<strong>న్యూజిలాండ్ 348 ఆలౌట్.. షా, పుజారా విఫలం.. భారత్ 78/2</strong>న్యూజిలాండ్ 348 ఆలౌట్.. షా, పుజారా విఫలం.. భారత్ 78/2

ఈ మ్యాచ్‌లో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 348 పరుగులకు ఆలౌట్ చేసిన కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీషా(14), ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(11) మరోసారి దారుణంగా విఫలమవ్వగా... మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(58) పర్వాలేదనిపించాడు. దీంతో 42 ఓవర్లకు భారత్ 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. క్రీజులో రహానే (4 బ్యాటింగ్), కెప్టెన్ విరాట్ కోహ్లీ(17 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Sunday, February 23, 2020, 10:41 [IST]
Other articles published on Feb 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X