న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు జట్టులో మార్పులు, జడేజా బదులు కుల్దీప్.. కార్తీక్ బదులు..??

India vs England: Why Kuldeep Yadav can get the nod ahead of Ravindra Jadeja in Test series

హైదరాబాద్: ఇంగ్లిష్ గడ్డ మీద యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. తొలి టీ20లో ఐదు వికెట్లు పడగొట్టి అబ్బురపరచిన కుల్దీప్.. మొదటి వన్డేలో ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను చావు దెబ్బ తీశాడు. రెండో వన్డేలోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. దీంతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లోనూ ఈ చైనామన్ స్పిన్నర్‌కి అవకాశం కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

ఇప్పటి కుల్దీప్ వరకూ రెండు టెస్టుల్లో

ఇప్పటి కుల్దీప్ వరకూ రెండు టెస్టుల్లో

కుల్దీప్ ఇప్పటి వరకూ కేవలం రెండు టెస్టుల్లో మాత్రమే ఆడాడు. జడేజా స్థానంలో చోటు దక్కించుకున్న కుల్దీప్.. గత ఏడాది లంకపై రెండు టెస్టులు ఆడాడు. అదనపు పేసర్లు అవసరం కావడంతో.. దక్షిణాఫ్రికా పర్యటనకు కుల్దీప్‌ను పక్కనబెట్టారు. జడేజా, అశ్విన్‌లను ఆ సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ ఆ సిరీస్‌లో బరిలో దిగే అవకాశం జడ్డూకు రాలేదు. అప్ఘాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆడిన జడేజా ఆరు వికెట్లు తీశాడు.

జడేజాను పక్కనబెట్టే అవకాశాలు కనిపిస్తున్నా

జడేజాను పక్కనబెట్టే అవకాశాలు కనిపిస్తున్నా

ప్రస్తుత ఫామ్ ప్రకారం.. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు జడేజాను పక్కనబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో కుల్దీప్‌ను బరిలో దిగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ జడ్డూ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడని భావిస్తే మాత్రం అశ్విన్‌పై వేటు పడే ప్రమాదం ఉంది.

కార్తీక్ స్థానంలో రైనాను తీసుకుంటున్న విషయం

కార్తీక్ స్థానంలో రైనాను తీసుకుంటున్న విషయం

మరో పక్క కార్తీక్ స్థానంలో రైనాను తీసుకుంటున్న విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వివరణ ఇచ్చాడు. 'మిడిలార్డర్‌లో ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌ను ఆడించాలని ప్లాన్‌ చేసుకున్నాం. ఇందులో భాగంగానే దినేశ్‌ను కాదని రైనాకు అవకాశం ఇస్తున్నాం. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు ముందు భారత్‌ పదిహేనుకు పైగా వన్డేలు ఆడనుంది. ఈ వన్డేల ద్వారా పలువురి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి మిడిలార్డర్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాం' అని చెప్పాడు.

టీమిండియా బెంచ్‌ను మరింత బలంగా

టీమిండియా బెంచ్‌ను మరింత బలంగా

'ఇప్పుడు బ్యాటింగ్‌ చేస్తున్న ఆటగాళ్లు భవిష్యత్తులో అదే స్థానంలో తప్పనిసరిగా బ్యాటింగ్‌ చేస్తారని చెప్పలేను. వారి స్థానాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. వరల్డ్ కప్ నాటికి టీమిండియా బెంచ్‌ను మరింత బలంగా తయారు చేసుకునేందుకే ఈ ప్రయత్నాలు' అని బంగర్‌ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, July 17, 2018, 16:10 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X