న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టు ఎంపికలో కోహ్లీకి సాయం చేయండి: గవాస్కర్

India Vs England: Sunil Gavaskar wants chief selector on overseas tour with Team India

ఇంగ్లాండ్: అభిమానమో.. అనుమానమో కానీ.. ఇంగ్లాండ్ వేదికగా శనివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మూడో టెస్టుకు తుదిజట్టు ఎంపిక విషయంలో సహాయం చేయమంటూ సునీల్ గవాస్కర్ క్రికెట్ అభిమానులను కోరుతున్నాడు. లార్డ్స్‌ టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించి కుల్‌దీప్‌కు స్థానం కల్పించడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు, కోహ్లీ టెస్టు కెప్టెన్ బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఆడిన జట్టుతో వరుసగా రెండో టెస్టు‌ ఆడింది లేదు.

అలా జట్టులో మార్పులు చేస్తూనే బరిలోకి దిగుతుండటంతో.. కెప్టెన్‌కు సాయపడమంటూ.. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. 'ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో సెలక్టర్లు శరణ్‌దీప్‌ సింగ్‌, దేవాంగ్‌ గాంధీ ఉన్నారు. కానీ, బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఇంగ్లాండ్‌ పంపాలని కోరుకుంటున్నాను. కోహ్లీతో కలిసి ప్రసాద్‌ నాటింగ్‌హామ్‌ వేదికగా జరిగే మూడో టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయాలి.' అని గవాస్కర్‌ అన్నారు.

' ఎందుకంటే సిరీస్‌లో ఇంకా నిలవాలంటే ఈ టెస్టులో తప్పక గెలవాలి. లేదంటే సిరీస్‌ ఇంగ్లాండ్‌ కైవసం అవుతుంది. ఈ విషయాన్ని మరచిపోవద్దు. విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. తాను ఆడినప్పటికీ, జట్టు సరైన ప్రదర్శన చేయకపోతే ఆ ఒత్తిడి కెప్టెన్‌పై ఉంటుంది. విరాట్‌ ఇప్పుడు ఆ పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. తుది జట్టు ఎంపికకు సంబంధించి అందరూ ఇప్పుడు అతడ్ని ప్రశ్నిస్తున్నారు' అని తెలిపారు.

'ఐదు టెస్టులకు పరిగణనలోకి తీసుకుంటే కోహ్లీ ఎంపిక సరిగా లేదు. ఒక్క జొహన్నెస్‌బర్గ్‌ టెస్టులోనే భారత్‌ విజయం సాధించింది. మిగతా నాలుగు టెస్టుల్లోనూ పరాజయాలే. అందుకే కోహ్లీకి సాయం చేయమని అంటున్నా. కోహ్లీతో ఎమ్మెస్కే ఉంటే ఇరువురు వ్యూహాలను పంచుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో చోటు చేసుకునే చర్చ ఇద్దరికీ కలిసి వస్తోంది. అందుకే సెలక్టర్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో చర్చించి జట్టును ఎంపిక చేయాలని కోరుకుంటున్నా' అని గవాస్కర్‌ వివరించారు.

Story first published: Thursday, August 16, 2018, 14:16 [IST]
Other articles published on Aug 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X