న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లీషు గడ్డపై ఓటమి: కోహ్లీ కెప్టెన్సీపై గవాస్కర్ ప్రశ్న

By Nageshwara Rao
India Vs England: Sunil Gavaskar questions Virat Kohlis captaincy after series defeat

హైదరాబాద్: విదేశీ గడ్డపై వరుసగా రెండో టెస్టు సిరిస్ ఓడిపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సందేహాం వ్యక్తం చేశాడు. సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియాపై ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 మరో టెస్టు మిగిలుండగానే

మరో టెస్టు మిగిలుండగానే

తద్వారా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-1తో మరో టెస్టు మిగిలుండగానే ఆతిథ్య ఇంగ్లాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టుపై క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ ఓటమిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ సిరిస్‌లో దూసుకుపోతోన్న విరాట్ కోహ్లీ

ఈ సిరిస్‌లో దూసుకుపోతోన్న విరాట్ కోహ్లీ

జట్టులోని మిగతా ఆటగాళ్లు విఫలమవతున్నా... కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తన బ్రాండ్ క్రికెట్‌ను ఆడుతూ దూసుకుపోతున్నాడు. ఈ పర్యటనలో ఇప్పటికే 500కుపైగా పరుగులు చేసి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు కోహ్లీపైనే ఎక్కువగా ఆధారపడటంపై గవాస్కర్ మండిపడ్డాడు.

కోహ్లీ ఆట తీరును ఆస్వాదిస్తారా?

కోహ్లీ ఆట తీరును ఆస్వాదిస్తారా?

ఈ సిరీస్‌లో కోహ్లీ ఎంతవరకూ చేయాలో అంతవరకూ చేశాడని, మిగతా వారు మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారన్నాడు. గవాస్కర్ మాట్లాడుతూ "ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కోహ్లి సాధించిన సెంచరీలు చూశాం.. హాఫ్‌ సెంచరీలు కూడా చూశాం. ప్రతీసారి కోహ్లీ సెంచరీలు, హాఫ్‌ సెంచరీలు చేస్తూ కూర్చుంటే మిగతా వారు అతని ఆట తీరును ఆస్వాదిస్తారా" అని ప్రశ్నించాడు.

కోహ్లీ కూడా మనిషే కదా

కోహ్లీ కూడా మనిషే కదా

"కోహ్లీ కూడా మనిషే కదా. అన్ని సందర్బాల్లో అతనిపైనే ఆధారపడితే ఎలా. నా వరకూ టీమిండియా మొత్తం కోహ్లిపైనే ఆధారపడినట్లు కనబడుతోంది. ఇది మంచి విధానం కాదు. సిరీస్‌ను కోల్పోవడానికి టీమిండియా బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణం" అని గావస్కర్‌ విమర్శించాడు. కాగా, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు ఓవల్ వేదికగా సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, September 4, 2018, 14:26 [IST]
Other articles published on Sep 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X