న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్ మార్చుకుంటాడా.. ధావన్నే మారుస్తారా..??

India vs England: Shikhar Dhawan Vows To Come Back Stronger After Edgbaston Failure

హైదరాబాద్: సెహ్వాగ్‌, గంభీర్‌, ద్రావిడ్‌, సచిన్‌, లక్ష్మణ్‌, ధోనీలతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ విదేశాల్లో నిలకడగా రాణించి.. భారత్‌లోనే కాదు బయట కూడా తాము సాధించగలమనే నమ్మకాన్ని తెచ్చిపెట్టారు. కానీ ఈ బ్యాటింగ్‌ లైనప్‌లోని ఒక్కొక్కరే భారత జట్టుకు దూరం కాగా.. తర్వాతి తరం బ్యాట్స్‌మెన్‌ మళ్లీ చతికిలబడ్డారు. కొన్నేళ్ల నుంచి భారత క్రికెటర్లు కేవలం సొంతగడ్డపైనే తిరుగులేని ప్రదర్శన రాణిస్తున్నారు. కానీ కఠినమైన విదేశీ పర్యటనలకు వెళ్తే మాత్రం పేలవంగానే ముగిస్తున్నారు.

1
42375
కోహ్లీ మినహా జట్టులో ఎవ్వరూ అనుకున్నంత:

కోహ్లీ మినహా జట్టులో ఎవ్వరూ అనుకున్నంత:

కోహ్లి మినహా ఎవ్వరిలోనూ నిలకడ లేదు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో కొందరు అప్పుడప్పుడూ అయినా ఆడుతున్నారు. కానీ ప్రస్తుత జట్టులో విదేశీ ఫాస్ట్‌ పిచ్‌లపై నిలకడగా విఫలమవుతున్న ఆటగాడు మాత్రం శిఖర్‌ ధావనే. ఒక్క ఇంగ్లాండ్‌లో మాత్రమే కాదు.. ఫాస్ట్‌ పిచ్‌లున్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల్లో అతడి రికార్డు పేలవం. ఇంగ్లాండ్‌తో కలిపి ఈ నాలుగు దేశాల్లో ధావన్‌ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఫ్లాట్‌ పిచ్‌లకు నెలవైన ఉపఖండంలో మాత్రం పరుగుల వరద పారించేస్తాడు.

ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ ధావన్ కూడా..:

ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ ధావన్ కూడా..:

సెహ్వాగ్‌ లాగా దూకుడుగా ఆడి మ్యాచ్‌ ఫలితాలు మార్చేస్తాడని, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అని అతడికి విదేశాల్లోనూ మళ్లీ మళ్లీ అవకాశాలిస్తున్నట్లుంది. వన్డేల వరకు ఫాస్ట్‌ పిచ్‌లపై అయినా ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడేస్తాడు కానీ.. టెస్టుల్లో నిలిచి ఆడమంటేనే కష్టం. ఇక జట్టులో మరో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ లేకపోవడం కూడా ధావన్‌కు కలిసొస్తోంది. ఆరంభంలో కుడి, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉంటే బాగుంటుందన్న ఆలోచనను కూడా దృష్టిలో ఉంచుకుని ధావన్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్ అవకాశాలు కల్పిస్తోంది. కానీ వరుసగా విఫలమవుతున్నపుడు ఏ వాటం అయితే ఏంటి?

తప్పుల్ని పునరావృతం చేస్తుండటం అలవాటుగా మారి:

తప్పుల్ని పునరావృతం చేస్తుండటం అలవాటుగా మారి:

పదే పదే తప్పుల్ని పునరావృతం చేస్తుండటం ధావన్‌ వైఫల్యానికి ప్రధాన కారణం. గవాస్కర్‌ అన్నట్లు తన ఆటతీరును టెస్టులకు తగ్గట్లు మార్చుకోకపోవడమే అతడి సమస్య. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధావన్‌ సులువుగా ఫోర్లు కొట్టేసే బంతులు ఇక్కడ అతడిని దెబ్బ తీస్తున్నాయి. టెస్టుల్లో వికెట్‌ వెనుక ముగ్గురు నలుగురు స్లిప్‌ ఫీల్డర్లుంటారు. వన్డేల్లో ఎడ్జ్‌ తీసుకుని ఫోర్‌ వెళ్లే బంతులు ఇక్కడ క్యాచ్‌లు అవుతుంటాయి. ఆఫ్‌ సైడ్‌ ఆవల పడే బంతుల్ని ధావన్‌ విడిచిపెట్టలేడు! వాటిని అందుకునే ప్రయత్నంలో తరచుగా ఔటవుతుంటాడు. తొలి టెస్టులోనూ ఇలాగే రెండుసార్లూ వికెట్ల వెనుకే క్యాచ్‌ ఇచ్చాడు.

రోహిత్ లాగానే తేలిపోతున్న ధావన్:

రోహిత్ లాగానే తేలిపోతున్న ధావన్:

డిఫెన్స్‌ ఆడలేకపోవడం కూడా ధావన్‌కున్న పెద్ద బలహీనత. టెస్టుల్లోనూ వన్డేల్లో మాదిరే ప్రతి బంతినీ ఆడాలని చూస్తాడు. వికెట్‌ సమర్పించుకుంటుంటాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ తర్వాతైనా అతడిలో మార్పు వచ్చి తొలి టెస్టులో ఆచితూచి ఆడతాడనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. ఫామ్‌తో సంబంధం లేకుండా తనకు అవకాశం ఇస్తే.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రోహిత్‌ శర్మ సైతం ధావన్‌ లాగే ఫ్లాట్‌ పిచ్‌లపై అదరగొట్టేస్తాడు. ఫ్లాట్‌ పిచ్‌లపై తేలిపోతుంటాడు.

Story first published: Tuesday, August 7, 2018, 10:25 [IST]
Other articles published on Aug 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X