న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అనుకోకుండా క్రికెటర్‌ అయ్యా.. టీమిండియా జెర్సీ ధరిస్తానని అసలు ఊహించలేదు'

India vs England: Ravichandran Ashwin says I accidentally became a cricketer
Ind vs Eng 2021,3rd Test : ‘Never Imagined I Will Wear The Indian Jersey’ : R Ashwin | Oneindia

అహ్మదాబాద్: అనుకోకుండా క్రికెటర్‌ అయ్యానని టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇక భారత‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని అసలు ఊహించలేదని తెలిపాడు. మొతేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ టెస్ట్ ఫార్మాట్‌లో నాలుగు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఔట్ చేసి ఈ ఘనత అందుకున్నాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అశ్విన్ చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా యాష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు.

India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'

అనుకోకుండా క్రికెటర్‌ అయ్యా:

అనుకోకుండా క్రికెటర్‌ అయ్యా:

తాజాగా రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ... 'అనుకోకుండా క్రికెటర్‌ అయ్యాను. టీమిండియా జెర్సీ ధరిస్తానని అసలు ఊహించలేదు. అయితే విజయంలో కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించిన సందర్భాల్లో.. ఆశీర్వాదంతో అలా జగిందని నేను భావించేవాడిని. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో భారత్‌ తరఫున ఆడటం ఎంతో అదృష్టమని తెలిసి వచ్చింది' అని తెలిపాడు. 'ఐపీఎల్‌ కోసం దుబాయ్‌కు వెళ్లినప్పుడు నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఆడతానని అనుకోలేదు. ప్రతిదీ నాకు దక్కిన బహుమతే. ఆటను ప్రేమిస్తూ ఉంటే అదే మనకి తిరిగి విజయాల్ని అందిస్తుంది' అని యాష్ అన్నాడు.

మూడు నెలలు గొప్పగా సాగాయి:

మూడు నెలలు గొప్పగా సాగాయి:

'జోఫ్రా ఆర్చర్‌ సమీక్షకు వెళ్లిన తర్వాత 400 వికెట్ల ఘనత సాధించానని తెలిసింది. బోర్డుపై టెస్టుల్లో 400 వికెట్ల మార్క్‌ను అందుకున్నాని కనిపించింది. స్టేడియంలోని ప్రేక్షకులు లేచి చప్పట్లతో అభినందించారు. ఆ సమయంలో ఎలా భావోద్వేగం చెందానో మాటల్లో చెప్పలేను. గత మూడు నెలలు గొప్పగా సాగాయి' అని అశ్విన్ పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్ల మార్క్‌ను చేరుకున్న రెండో బౌలర్‌గా అశ్విన్ (77 టెస్టుల్లో) నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ (72 టెస్టులు) ఉన్నాడు.

తొలి బౌలర్‌గా:

తొలి బౌలర్‌గా:

ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఆర్ అశ్విన్ చరిత్రకెక్కాడు. అశ్విన్ కన్నా ముందు భారత్ తరఫున కపిల్ దేవ్ (434), అనిల్ కుంబ్లే (619), హర్భజన్ సింగ్ (417) నాలుగు వందల వికెట్ల ఘనతను అందుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటికే 600 వికెట్లు తీసిన అశ్విన్.. ఈ ఘనతను అందుకున్న ఐదో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (956), హర్భజన్ సింగ్ (711), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610) అశ్విన్ కన్నా ముందున్నారు.

రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్:

రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్:

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. స్పిన్‌కి అతిగా అనుకూలించిన ఈ పిచ్‌పై భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల పండగ చేసుకోవడంతో.. మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు జట్ల ఫాస్ట్ బౌలర్లు కనీసం ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు. టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పిచ్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇక ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగానే మార్చి 4 నుంచి నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. మరి అప్పుడు పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Story first published: Saturday, February 27, 2021, 11:34 [IST]
Other articles published on Feb 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X