న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డూ ఆర్ డై టెస్టు: కార్తీక్‌కి మరో ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ సూచన

By Nageshwara Rao
India vs England: Desperate India set for reshuffle in do-or die Test

లండన్: ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టులో దినేశ్ కార్తీక్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ ఆడించాలని వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో రెండు టెస్టుల్లోనూ టీమిండియా ఓడిపోయింది. తొలి టెస్టులో బౌలింగ్‌లో అంచనాలకు మించి రాణించి విజయానికి చేరువగా వచ్చిన కోహ్లీసేన బ్యాటింగ్ తడబాటుతో లార్డ్స్ టెస్ట్‌లో ఆతిథ్య జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

దీంతో.. మూడో టెస్టు కోసం తుది జట్టులో మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ యోచిస్తుండగా.. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన వికెట్ కీపర్‌ దినేశ్ కార్తీక్‌పై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని తుది జట్టులోకి తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి.

1
42376

ఈ నేపథ్యంలో ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గంభీర్ మాట్లాడుతూ దినేశ్ కార్తీక్‌కి మరో ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు. "రిజర్వ్ బెంచ్‌పై ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అందుబాటులో ఉండటంతో.. దినేశ్ కార్తీక్‌ స్థానంలో అతడ్ని ఆడించాలనుకోవడం సహజమే. కానీ, కార్తీక్‌ కెరీర్‌ ఇప్పుడు చరమాంకలో ఉన్నట్లు ఉంది" అని అన్నాడు.

"ఈ సిరీస్‌లో అతను నిరూపించుకోలేకపోతే అతడి కెరీర్ గల్లంతేనేమో? మూడో టెస్టులో లేదా ఆ తర్వాత టెస్టులో దినేశ్ కార్తీర్‌కి అవకాశం దక్కకపోతే, మళ్లీ టెస్టుల్లో అతడిని చూడలేం. కాబట్టి.. దినేశ్ కార్తీక్‌కి మరో ఛాన్సివ్వాలి. ఇక రిషబ్ పంత్‌ విషయానికి వస్తే అతడు యువ క్రికెటర్. కాబట్టి, అతని ముందు చాలా కెరీర్ ఉంది" అని అన్నాడు.

"మూడో టెస్టు కోసం భారత తుది జట్టులో ఎక్కువ మార్పులు చేయకపోవడం మంచిది. ఎందుకంటే.. తుది జట్టు నుంచి ఆటగాళ్లను తరచూ తప్పిస్తుంటే.. వారిపై మనకు విశ్వాసం లేదని పరోక్షంగా చెప్పినట్లవుతుంది. సిరీస్‌లో భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్స్ తమ ఆటతీరుని మెరుగుపర్చుకుంటే.. తప్పకుండా ఇంగ్లాండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించొచ్చు" అని గంభీర్ అన్నాడు.

Story first published: Friday, August 17, 2018, 20:18 [IST]
Other articles published on Aug 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X