ఛేజ్ మాస్టర్ క్యాచ్ వదిలేస్తే అంతే: సునీల్ గవాస్కర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ ఛేజ్ మాస్టర్ అని, భారీ లక్ష్యాన్ని కూడా ఈజీగా మారుస్తాడని కొనియాడాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌పై జియో హాట్‌స్టార్ షోలో మాట్లాడిన గవాస్కర్.. కోహ్లీ ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు.
కోహ్లీ క్యాచ్ వదిలేస్తే..
'సిరాజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడం గుజరాత్ టైటాన్స్‌కు తీవ్ర నష్టం చేసింది. కోహ్లీ కేవలం కింగ్ మాత్రమే కాదు.. ఛేజ్ మాస్టర్. తొలి బంతికే కోహ్లీ లాంటి ఆటగాడి క్యాచ్‌ను వదిలేస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. భారీ లక్ష్యాలను సులువుగా ఛేదించడం విరాట్ కోహ్లీ స్టైల్. క్రికెట్ చరిత్రలోని గొప్ప ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. కష్టమైన లక్ష్యాన్ని సైతం సునాయసం చేశాడు.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీతో పాటు రాణించిన దేవదత్ పడిక్కల్(55)ను కూడా గవాస్కర్ ప్రశంసించాడు. 'దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ చెప్పినట్లుగా.. పడిక్కల్ చాలా చక్కటి క్రికెట్ షాట్స్ ఆడుతున్నాడు. గతంలో అతను ఆఫ్-సైడ్ ఆటగాడిగా కనిపించాడు. అతని ప్రధాన స్కోరింగ్ ప్రాంతాలు కవర్, మిడ్-ఆఫ్. ఆన్-సైడ్‌లో అతను ఇబ్బంది పడేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిమితిని అధిగమించాడు.
అతను ఇప్పుడు స్క్వేర్ బిహైండ్ సిక్స్‌లు, బౌండరీలను కూడా కొడుతున్నాడు. ఇది RCB బ్యాటింగ్ బలాన్ని పెంచుతుంది. వారికి మూడో స్థానంలో దేవదత్ ఉండగా.. నాలుగో స్థానంలో కెప్టెన్ రజత్ పాటిదార్ ఉన్నారు. వీరిద్దరూ మొదటి బంతి నుంచే సిక్సర్లు కొట్టగలరు. ఇది ఆర్‌సీబీకి కలిసొచ్చే అంశం.’అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ ఐదు విజయాలను నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ బెర్త్‌కు మరో మూడు విజయాల దూరంలో నిలిచింది. ఏప్రిల్ 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆర్‌సీబీ తలపడునుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications