ఢిల్లీ పేసర్ తలకు తీవ్ర గాయం.. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు!(వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) పేసర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకునే క్రమంలో వెనక్కి పడిపోయిన లుంగి ఎంగిడి తలకు తీవ్ర గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. లుంగి ఎంగిడి మెడ భాగంలో తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. ఫిజియో మాటలకు ఎంగిడి స్పందించినా.. లేవలేకపోయాడు.
అసలేం జరిగిందంటే..?
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా అక్షర్ పటేల్ వేసిన మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్ ఆడగా.. మిస్ టైమ్ అయిన బంతి మిడాఫ్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేసిన లుంగి ఎంగిడి వెనక్కి పరుగెత్తుతూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతిని అంచనా వేయడంలో విఫలమై వెనక్కి పడిపోయాడు. దాంతో అతని తల నేలకు బలంగా తాకింది.

ఈ గాయం ధాటికి అలానే పడిపోయిన ఎంగిడి నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్‌ను మైదానంలోకి రప్పించి ఆసుపత్రికి తరలించాడు. ఈ అనూహ్య ఘటన అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది. ఆటకు కూడా అంతరాయం కలిగింది. ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా దుష్మంత చమీరా బరిలోకి దిగాడు.
కేఎల్ రాహుల్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. నితీష్ రాణా(44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications