అప్పుడు కోహ్లీ టీమ్‌లో హీరో.. ఇప్పుడు ఐపీఎల్‌లో అంపైర్!
ఒకప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు అతను ఓ హీరో. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. కానీ కాలక్రమేణా క్రికెటర్లందరూ స్టార్లు అవ్వలేరు. అలాగే కొందరు మరుగున పడిపోయారు. తాజాగా అదే జట్టులో సభ్యుడై ఓ ఆటగాడు సుమారు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ వేదికపై మెరిశాడు. అయితే ఈ సారి ఆటగాడిగా కాదు.. అంపైర్‌గా సరికొత్త అవతారంలో దర్శనమిచ్చాడు.
అండర్-19 వరల్డ్ కప్ హీరో.. అజితేష్ అర్గల్
2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు అండర్-19 ప్రపంచకప్‌ను ముద్దాడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో పేసర్ అజితేష్ అర్గల్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. కేవలం 5 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో అజితేష్ అర్గల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. కానీ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి వారు అంతర్జాతీయ స్థాయిలో స్టార్లయితే.. అజితేష్ కెరీర్ మాత్రం 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకే పరిమితమై 2015లో ముగిసిపోయింది.

ఆటగాడిగా రాని అవకాశం.. అంపైర్‌గా ఐపీఎల్ ఎంట్రీ
క్రికెటర్‌గా ఐపీఎల్‌లోఅడుగుపెట్టాలని అజితేష్ అర్గల్ ఎంతో ఆశపడ్డాడు. గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్(ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ.. అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించాడు. 37 ఏళ్ల వయస్సులో ఇప్పుడు అంపైర్‌గా ఐపీఎల్ 2026లో అరంగేట్రం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆయన ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించారు.
ఆటగాడు అంపైర్ ఎలా అయ్యాడు!
క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో అజితేష్ అర్గల్ స్పోర్ట్స్ కోటాలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించాడు. అయితే మైదానంపై మక్కువతో అంపైరింగ్ వైపు మొగ్గు చూపాడు. 2023లో బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, డొమెస్టిక్ టోర్నమెంట్లు, ఇండియా-ఏ మ్యాచ్‌లలో అనుభవం గడించాడు. తాజాగా ఐపీఎల్ వేదికపై తన పాత సహచరుడు రవీంద్ర జడేజా ఆడుతున్న మ్యాచ్‌కే అంపైర్‌గా వ్యవహరించడం విశేషం. త్వరలోనే తన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడే మ్యాచ్‌లోనూ ఆయన అంపైర్‌గా కనిపించే అవకాశం ఉంది.
సక్సెస్ అనేది ఒక్కోసారి ఒక్కో రూపంలో వస్తుందని అజితేష్ నిరూపించాడు. వరల్డ్ కప్ హీరోగా గుర్తింపు పొంది, ఆ తర్వాత కాల గర్భంలో కలిసిపోకుండా.. మళ్ళీ అంపైర్‌గా ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక లీగ్‌లో భాగమవ్వడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆటగాడిగా మైదానంలో పరుగెత్తలేకపోయినా.. అంపైర్‌గా నిర్ణయాలు తీసుకుంటూ అదే మైదానంలో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications