నెట్టింట మంటలు పుట్టిస్తున్న ఆర్సీబీ స్పిన్నర్ సెలబ్రేషన్! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్సీబీ యువ స్పిన్నర్ సుయాష్ శర్మ, గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్ తీసిన తర్వాత చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుభ్‌మన్ గిల్ ట్రేడ్ మార్క్ స్టైల్ అయిన 'బౌ డౌన్' (తలవంచి నమస్కరించడం) ముద్రనే సుయాష్ తిరుగు సమాధానంగా ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.
గిల్ వికెట్.. సుయాష్ శర్మ కౌంటర్ సెలబ్రేషన్
గుజరాత్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. సుయాష్ శర్మ వేసిన షార్ట్ గూగ్లీని అంచనా వేయడంలో విఫలమైన గిల్.. లాంగ్-ఆన్ దిశగా షాట్ ఆడి దేవదత్ పడిక్కల్ చేతికి చిక్కాడు. 24 బంతుల్లో 32 పరుగులు చేసిన గిల్ నిష్క్రమించగానే.. సుయాష్ శర్మ మైదానంలో గిల్ స్టైల్‌లోనే వంగి నమస్కరిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. సాధారణంగా గిల్ సెంచరీ చేసినప్పుడు అభిమానులకు అభివాదం చేస్తూ ఇలా చేస్తాడు, కానీ సుయాష్ అతడిని ఔట్ చేసి అదే స్టైల్‌లో వెక్కిరించడం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

కోహ్లీ, పడిక్కల్ మెరుపులు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ (100) సాయంతో 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్‌లోనే వాషింగ్టన్ సుందర్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన కోహ్లీ.. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 44 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆర్సీబీ ఘన విజయం
మరోవైపు దేవదత్ పడిక్కల్ కూడా 55 పరుగులతో మెరిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పారు. చివరిలో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా మ్యాచ్‌ను ముగించి ఆర్సీబీకి 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా.. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
సోషల్ మీడియాలో చర్చ
సుయాష్ శర్మ చేసిన 'బౌ డౌన్' సెలబ్రేషన్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది ఆటలో భాగమైన దూకుడు అని సమర్థిస్తుండగా, మరికొందరు సీనియర్ ఆటగాడైన గిల్‌ను అలా వెక్కిరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరు అటు ఆట పరంగా, ఇటు డ్రామా పరంగా అభిమానులకు పూర్తి వినోదాన్ని పంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications