Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీవీ సింధు కంటి పక్కన ఆ వింత పరికరం ఏంటి?

ఇటీవల జరిగిన ఉబెర్ కప్ మ్యాచ్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కంటి పక్కన(కణత భాగంలో) ఓ స్టిక్కర్ లాంటి పరికరాన్ని ధరించి కనిపించింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆ పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు అది ఏంటి? ఆటలో దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటనే చర్చ క్రీడా ప్రపంచంలో మొదలైంది. నిజానికి అది ఓ అత్యాధునిక పరికరం.. దీనిని 'టెంపుల్' అని పిలుస్తున్నారు.

మెదడు పనితీరును పసిగట్టే సాంకేతికత
ఈ పరికరం అథ్లెట్ల మానసిక స్థితిని అంచనా వేయడానికి రూపొందించబడింది. ఇది ప్రధానంగా మెదడులోని రక్త ప్రసరణను, ఆలోచనల తీవ్రతను, ఏకాగ్రత స్థాయిలను ట్రాక్ చేస్తుంది. ఆట సమయంలో క్రీడాకారులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారు? వారు ఏ సమయంలో అత్యంత ఏకాగ్రతతో ఉన్నారు? వంటి అంశాలను ఈ పరికరం డేటా రూపంలో విశ్లేషిస్తుంది. అథ్లెట్ల 'మెంటల్ స్టేటస్'ను అర్థం చేసుకోవడం ద్వారా వారి ప్రదర్శనను మరింత మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.

What is the Sticker on PV Sindhu Face Secret Behind Temple Device by Zomato Founder Deepinder Goyal

జొమాటో ఫౌండర్, సింధు భర్త భాగస్వామ్యం
ఈ వినూత్న ప్రాజెక్ట్ వెనుక ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ టీమ్ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పీవీ సింధు భర్త వెంకట దత్తసాయి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. స్పోర్ట్స్ టెక్నాలజీలో ఇదొక కొత్త విప్లవం అని చెప్పవచ్చు.

తొలిసారిగా సింధుపై ప్రయోగం
ప్రస్తుతం ఈ 'టెంపుల్' పరికరం ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని మొదటిసారిగా పీవీ సింధుపై పరీక్షించారు. మైదానంలో ఆటగాళ్ల మెదడు ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవడానికి ఈ డేటా కోచ్‌లకు, శాస్త్రవేత్తలకు ఎంతో కీలకం కానుంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ క్రీడా ప్రపంచంలో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Story first published: Saturday, April 25, 2026, 9:24 [IST]
Other articles published on Apr 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+