Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీతో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్

ఢిల్లీ క్యాపిటల్స్(DC) ఓపెనర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. తద్వారా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కేఎల్ రాహుల్.. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి మరో 21 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతని ధాటికి ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. నితీష్ రాణా(44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.

DC vs PBKS KL Rahul Shatters Records Becomes First Indian to Smash 150 in an IPL Innings

తొలి భారత ఆటగాడిగా..

ఈ ఇన్నింగ్స్‌తో కేఎల్ రాహుల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్(152 నాటౌట్) తర్వాత, అభిషేక్ శర్మ(141), కేఎల్ రాహుల్(132 నాటౌట్), శుభ్‌మన్ గిల్(129), రిషభ్ పంత్(128 నాటౌట్) తర్వాతి స్థానంలో ఉన్నారు.

మూడు జట్లపై సెంచరీ..

ఐపీఎల్ చరిత్రలోనే మూడు వేర్వేరు జట్లపై శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డు సాధించాడు. అతను పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై రెండేసి శతకాలు నమోదు చేశాడు. తద్వారా సంజూ శాంసన్ పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డు‌ను సమం చేశాడు. సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లపై సెంచరీలు బాదాడు. క్వింటన్ డికాక్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌పై సెంచరీలు నమోదు చేశాడు.

మూడు జట్లపై రెండేసి సెంచరీలు..

ఐపీఎల్ చరిత్రలోనే మూడు వేర్వేరు జట్లపై రెండేసి సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండేసి శతకాలు నమోదు చేశారు. మరే ఆటగాడు కూడా ఈ ఫీట్ అందుకోలేదు. సంజూ శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై రెండేసి శతకాలు నమోదు చేయగా.. షేన్ వాట్సన్ రాజస్థాన్, చెన్నైపై, డేవిడ్ వార్నర్ ఢిల్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండేసి శతకాలు నమోదు చేశారు.

అతిపెద్ద వయస్కుడిగా..

ఐపీఎల్ శతకం బాదిన అతిపెద్ద వయస్కుడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 34 ఏళ్ల 7 రోజుల వయసులో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్(39 ఏళ్ల 184 రోజుల వయసులో), 36 ఏళ్ల 165 రోజు వయసులో సెంచరీబాది కేఎల్ రాహుల్ కంటే ముందంజలో కొనసాగుతున్నాడు.

Story first published: Saturday, April 25, 2026, 19:04 [IST]
Other articles published on Apr 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+