న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాకంటూ ప్రత్యేకత ఏమీ లేదు.. పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తా'

 India vs England 2nd Test: Hardik Pandya defends decision to play two spinners

హైదరాబాద్: తాను ప్రత్యేకంగా ఒకటే పని చేయాలని అనుకోనని.. పరిస్థితులు తగ్గట్లుగా మారతానని అంటున్నాడు భారత యువ క్రికెటర్. పరుగులు చేసేటప్పుడు బ్యాట్స్‌మన్‌లా, బంతులు విసిరేటప్పుడు బౌలర్‌గా ఆలోచిస్తానని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అంటున్నాడు. తనను బ్యాటింగ్‌ ఆల్‌రౌండరా? బౌలింగ్‌ ఆల్‌రౌండరా? అని మీడియా వేసిన ప్రశ్నకు పాండ్య సమాధానమిచ్చాడు.

'నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు బ్యాట్స్‌మన్‌లా ఆలోచిస్తా. బౌలింగ్‌ చేస్తుంటే బౌలర్‌గా ఆలోచిస్తా. నాకంటూ ఒక కచ్చితమైన పాత్ర లేదు. నేను బంతులు విసిరేటప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ పొరపాట్లు చేసేలా కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో ఒత్తిడి చేస్తా. ఇంకే ప్రయత్నమూ చేయను. ఒత్తిడి అనువించేలా బౌలింగ్‌ చేసి అవతలి వారు ఎలా స్పందిస్తున్నారో చూస్తా. ప్రత్యర్థి భారీ షాట్లు ఆడాలనే ప్రయత్నిస్తారు. అలాంటప్పుడే వారు పొరపాట్లు చేస్తారు' అని పాండ్యా అన్నాడు.

1
42375

క్రికెట్‌లో అదృష్టం గురించి ఆధారపడనని పాండ్య అన్నాడు. మైదానంలో జరిగేదంతా కష్టానికి తగిన ఫలితమే పేర్కొన్నాడు. మూడో రోజు భోజన విరామం తర్వాత పిచ్‌ తమకు తగినంత సహకరించలేదని పేర్కొన్నాడు. అందుకే ఎంత బాగా బౌలింగ్‌ చేసినా ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బాగా పరుగులు చేశారన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏ జట్టైనా అంతే అన్నాడు. ముఖ్యంగా బెయిర్ స్టో.. క్రిస్ వోక్స్ పరుగుల వరద పారించి మ్యాచ్ ను పూర్తిగా తమ వైపుకు తిప్పేసుకున్నారని తెలిపాడు.

'ఆ పరిస్థితుల్లో భారత్‌యే కాదు. ఏ జట్టు అయినా ఇలాంటి స్కోరే చేయగలదు. వాళ్లకు బౌలింగ్ చేసినప్పుడు పిచ్ స్వభావం పూర్తిగా మారిపోయింది. కానీ, ఆదివారం వికెట్ పూర్తిగా సహకరించలేదు. మొదటి రోజు ఎలా ఉంటుందనుకున్నామో అలానే ఉంది. కేవలం ఈ వాతావరణ పరిస్థితుల కారణంగానే మ్యాచ్ ఓడిపోయాం' అని అన్నాడు. టీం మేనేజ్‌మెంట్ రెండో స్పిన్నర్‌ని తీసుకుందామా.. మూడో పేసర్‌ని తీసుకోవాలా అనే యోచనలో ఉండే తనను తుది జట్టులోకి ఎంపిక చేసిందని పేర్కొన్నాడు.

Story first published: Monday, August 13, 2018, 9:48 [IST]
Other articles published on Aug 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X